కొన్ని నిజాలు ఘాటుగానే ఉంటాయి. ఎంత మంది సానుభూతి పరులు ఉన్నా.. ఎన్ని మీడియా సంస్థలు మోసినా.. ప్రజల నాడి నాయకులకు అత్యంత కీలకం. ఇది కనుక పోతే.. కష్టమనే భావన అందరికీ తెలి సిందే. ఇప్పుడు ఇదే సమస్య.. వైసీపీ రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణరాజుకు కూడా ఎదురవుతోంది. ఆయ న వైసీపీతో విభేదించిన తర్వాత.. తనపై కేసులు నమోదయ్యాయని.. ప్రజలను కూడా కలుసుకోకుండా.. అడ్డుకుంటున్నారని.. పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేశారు. ఇవి నిజంగానే ప్రజల్లోకి వెళ్లాయి. సానుభూతి ఏర్పడింది.
ఇక, నిత్యం ఢిల్లీలో కూర్చుని.. ఆయన మీడియాతో ప్రసంగాలు దంచికొడుతున్నారు. లోకాభిరామాయ ణం అంతా మాట్లాడుతున్నారు. బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో తననియోజకవర్గం గురించి.. ఏనాడై నా ఒక్క సమీక్ష చేశారా? ఢిల్లీలో కూర్చున్నా.. ప్రధాని మోడీ.. కాకినాడ వాసులతో ఇటీవల మాట్లాడారు.
ఇలాంటి వ్యూహం ఏనాడైనా.. రాజుగారు అమలు చేశారా? ఇదీ.. ఇప్పుడు వలంటీర్ల సాక్షిగా.. నరసాపురం లో జరుగుతున్న యాంటీ టాక్. ఎంపీ ఢిల్లీలో కూర్చుంటారు.. ఆయనకు నియోజకవర్గంతో పనిలేదు.. అంటూ.. వలంటీర్లు ప్రచారం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
దీనిని తప్పుపట్టడానికి కూడా లేకుండా పోయింది. ఎప్పుడూ... రఘురామరాజు.. నేను నా నరసాపురం ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాను.. అని చెప్పుకొనే ఏ ఒక్క సంఘటన ఆయన దగ్గర లేదు. పోనీ.. స్థానిక సమస్యలను కూడా ఆయన పరిష్కరించడం లేదు.
ఎందుకంటే.. ఇప్పుడు అక్కడ ఆయన మాట వినేవారు కూడా ఎవరూ లేరు. అయినా.. వచ్చే ఎన్నికల్లో తనే గెలుస్తానని రాజుగారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఇచ్చే పార్టీని ఇప్పటికే రెడీ చేసుకున్నారని కూడా అంటున్నారు.
అయితే.. సదరు పార్టీ నరసాపురంలో గెలిచిన సందర్భం లేదు. 1984-96 తర్వాత..సదరు పార్టీ ఇక్కడ గెలిచిన పాపాన పోలేదు. అలాంటి పార్టీ తరపున రాజుగారు టికెట్ తెచ్చుకుంటున్నారని.. ఇక్కడ ప్రచారం జరుగుతోంది. టికెట్ తెచ్చుకోవడం సాధ్యమేమో.. కానీ.. క్షేత్రస్థాయిలో గల్లీ లెవిల్లో.. ఆయన గురించి జరుగుతున్న చర్చను పరిశీలిస్తే.. మాత్రం.. ఆయన గెలుపు సాధ్యం కాకపోగా.. మూడో ప్లేస్‌కు చేరుకుంటే ఎక్కువగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి దీనిని అడ్డుకునేందుకు రాజుగారు.. ఇప్పటి నుంచైనా.. నియోజకవర్గం పాలిటిక్స్‌పై దృష్టి పెడతారో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.