సోనియాకు నోటీసులు

Update: 2015-12-07 15:19 GMT
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కింది కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని వారు దాఖలు చేసుకున్నపిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చి విచార‌ణ‌కు హాజ‌రుకాల‌ని స్ప‌ష్టం చేసింది.

భారత మొట్టమొదటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ ను 2008లో మూసివేశారు. ఈ క్ర‌మంలో పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేశారు. ఈ కేసులో పాటియాలా హౌస్ కోర్టు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి స‌మ‌న్లు జారీ చేసింది. వారిద్ద‌రే కాకుండా స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ ఇందులో భాగ‌స్వామ్యం అయిన‌ పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా సమన్లు జారీ చేసింది. దీనిపై సోనియా, రాహుల్‌ లు ఢిల్లీ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. అయితే నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వారంతా విచారణకు హాజరుకావాల్సిందిగా న్యాయ‌మూర్తి ఆదేశాలిచ్చారు.
Tags:    

Similar News