తిమ్మినిబమ్మిని చేసే సత్తా ప్రధాని మోడీకి ఆయనకు అత్యంత సన్నిహితుడు అమిత్ షాకు ఎంత ఉందన్న విషయాన్ని మరోసారి చేతల్లో చేసి చూపించారు. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తమదైన శైలిలో ముగింపు ఇవ్వటం ద్వారా సంచలనంగా మారారు. మహారాష్ట్రలో తాము కోరుకున్నట్లే తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కోసం మోడీషాలు కదిపిన పావులతో రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమను తాము తోపులుగా చెప్పుకునే జాతీయ మీడియా మహారాష్ట్ర ఎపిసోడ్ లో దారుణంగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. శివసేనకు కోలుకోలేనంత భారీ షాకివ్వటంలో మోడీషాల ప్లానింగ్ ఏమిటన్న విషయాన్ని గుర్తించే విషయంలో జాతీయ మీడియా దారుణమైన వైఫ్యలాన్ని మూటగట్టుకుందనే చెప్పాలి.
ఢిల్లీ పవర్ సర్కిల్స్ లోనూ.. కీలకమైన స్థానాల్లో మొహరించి ఉన్న మీడియాకు ఏ మాత్రం అనుమానం కలగకుండా ఉండటమే కాదు.. సోషల్ మీడియా కళ్లుగప్పి మహారాష్ట్ర ఎపిసోడ్ కు ఇచ్చిన ముగింపు భారీ ట్విస్ట్ గా మారిందని చెప్పక తప్పదు. జాతీయ మీడియా ఫోకస్ అంతా సేన చుట్టూనే తిరగటం.. రాజ్ భవన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఫోకస్ పెట్టకపోవటం ఈ ఫెయిల్యూర్ కు కారణంగా చెప్పాలి. దీనికి తోడు పవార్ ప్లాన్ బీని అంచనా వేయటంలోనూ ఫెయిల్ అయ్యిందని చెప్పాలి.
దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియా.. వాట్సాప్ లు వచ్చాక వాటి మీద ఆధారపడటం అంతకంతకూ పెరిగిపోవటం.. మానవ సంబంధాల విషయంలో మీడియాప్రతినిధులు సైతం వెనుకబడిపోవటం కూడా ఈ వైఫల్యానికి కారణంగా చెప్పాలి. గతంలో ఏదైనా పరిణామం చోటు చేసుకుంటే.. రోజుల పర్యంతం దాని చుట్టూనే తిరిగేవారు. దాని మీద కన్నేసే వారు. దానికి భిన్నంగా ఏ రోజుకు ఆ రోజు జరిగే పరిణామాల మీదే తప్పించి.. తెర వెనుక ఏం జరుగుతుంది? ఏం జరగనుందన్న విషయాన్ని గ్రహించే శక్తి తగ్గిపోవటం కూడా కారణంగా చెప్పాలి.