#RussiaUkrainewar: రష్యాపై దాడికి 'నాటో' కూటమి సిద్ధం.. 100 ఫైటర్ జెట్స్ రెడీ

Update: 2022-02-26 03:28 GMT
ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు నాటో కూటమి రంగంలోకి దిగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో  సమావేశమైన నాటో దేశాలు ఆ దేశంలో అధికారిక వెబ్ సైట్లే లక్ష్యంగా సైబర్ దాడులకు దిగాయి. డిఫెన్స్ వెబ్ సైట్ ను హ్యాన్ చేశాయి. బలగాలను యూరప్ సరిహద్దులకు తరలిస్తున్నాయి. అయితే దీనిపై పుతిన్ ఎలా స్పందిస్తారోనని ప్రపంచ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

ఉక్రెయిన్ పై రష్యా దాడి అప్రజాస్వామికమని.. ఆ దేశం అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించిందని నాటో పేర్కొంది. ఇప్పటికే రష్యాపై అనేక ఆంక్షలు విధించామని.. ఉక్రెయిన్ కు ఆర్థిక, రక్షణ పరంగా అండగా ఉంటామని తెలిపింది. ఉక్రెయిన్ తరుఫున రష్యాు ఎదుర్కొనేందుకు ఇప్పటికే 100 ఫైటర్ జెట్స్ సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. పుతిన్ ప్రభుత్వం వెంటనే తమ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని నాటో మరోసారి హెచ్చరించింది.

మరోవైపు యుద్ధంపై వెనక్కి తగ్గని పుతిన్ ను కట్టడి చేసేందుకు యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనతోపాటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ఆస్తులను స్తంభింపచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఇక రష్యాపై జపాన్, ఐరోపా, తైవాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, తైవాన్ సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలకు సిద్ధమయ్యాయి.  ఆర్థిక, ఇంధన, ఇతర ముఖ్యమైన రంగాలే లక్ష్యంగా ఆంక్షలు ఉండనున్నట్టు తెలుస్తోంది.

ఇక రష్యా చర్యలపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం కూడా  తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధంలో మృతుల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా-ఉక్రెయిన్ కు సూచించింది. మరోవైపు రష్యా డిఫెన్స్ సిస్టంపై అమెరికా సైబర్ దాడి చేసింది. దాడి గురించి ముందే ప్రకటించిన అమెరికా.. రష్యా డిఫెన్స్ సైట్ ను డౌన్ చేసింది.

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇరు దేశాలు చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు.
Tags:    

Similar News