శాంతి దూత, సహన మూర్తి పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి అసలు కారణమేంటో చెప్పారు. అది కూడా సాదాసీదా మాటల్లో కాకుండా తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా పోప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి తనదైన స్పందన కనబరుస్తున్నారు. మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలుస్తానని కూడా ప్రకటించారు. దీనర్థం శాంతి గురించి పుతిన్ కు పోప్ సందేశం ఇస్తారని భావించారు.
నాటోపై ధ్వజమెత్తుతూ..
యుద్ధం మొదలునుంచి పోప్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్రైస్తవ ప్రపంచంలో పోప్ స్థానానికి ఉన్న ప్రాధాన్యత రీత్యా ఆయన మధ్యవర్తిత్వం వహిస్తారనే ఆశాకిరణమూ కొందరిలో కనిపించింది. అయితే, తాజాగా యుద్ధంపై పోప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మద్దతు ఉన్న నాటో కూటమిని ఘాటుగా విమర్శించారు. రష్యా గుమ్మం ముందు నాటో మొరగడమే ఈ దండయాత్రకు
కారణమై ఉండొచ్చంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఇటలీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ ఈ విధంగా స్పందించారు.
పుతిన్ ను నాటో రెచ్చగొట్టింది..
ఉక్రెయిన్ విషయంలో రష్యా తీరుపై పోప్‌ను ప్రశ్నించగా.. ‘‘రష్యా సమీప దేశాల్లో నాటో ఉనికి పుతిన్‌ను రెచ్చగొట్టి ఉంటుంది. దాని ఫలితమే ఈ దురాక్రమణ అని అనుకుంటున్నా’’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిణామాలను 1990ల్లో రువాండాలో చోటుచేసుకున్న నరమేధంతో పోల్చారు. 1994లో రువాండాలోని టుట్సీ మైనార్టీలను తుడిచిపెట్టేందుకు అతివాద
హుతూ పాలకులు అరాచకాలకు పాల్పడ్డారని, ఆ మారణహోమంలో దాదాపు 8లక్షల మంది మరణించారని పోప్ గుర్తుచేసుకున్నారు. అయితే నాటోపై పోప్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మాస్కో వెళ్తా.. పుతిన్ ను కలుస్తా
యుద్ధం ఆపే విషయమై తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించాలనుకుంటున్నట్లు పోప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే తాము క్రెమ్లిన్‌ను సమయం కోరగా.. సమాధానం రాలేదన్నారు. తనతో భేటీ అయ్యే ఉద్దేశం పుతిన్‌కు లేదోమో అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి తాను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లబోనని, ముందు మాస్కోకు వెళ్లి పుతిన్‌ని కలుస్తానని చెప్పారు.
యుద్ధాన్ని ఆపేందుకు తాను తప్పకుండా ప్రయత్నిస్తానని అన్నారు.
పోప్ వ్యాఖ్యలు రష్యాకు సమర్థనే
రష్యా గుమ్మంలో నాటో మొరగడంతోనే యుద్ధం వచ్చిందంటూ పోప్ ఫ్రాన్సిస్ చేసిన వ్యాఖ్యలు ఒకరకంగా రష్యాకు సమర్థనే. ఉక్రెయిన్ నాటోలో చేరితే తమకు ముప్పు అని.. అందుకే ఈ యుద్ధం అని రష్యా చెబుతోంది. ఇప్పుడు పోప్ మాటలు కూడా ఇదే దిశగా ఉన్నాయి. నాటో రెచ్చగొట్టకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఆయన మాట్లాడడం ఒకరకంగా పుతిన్ కు నైతిన బలమే.