అమెరికాలోని డల్లాస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ప్రవాస భారతీయుడు గుండెపోటుతో మృతిచెందాడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మ్రుదుల్ చెరుకుపల్లికి ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని డల్లాస్ లోని బెయిలర్ స్కాట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మ్రుదుల్ కన్నుమూశారు. ముద్రుల్ కు భార్య - ఆరేళ్ల కూతురు ఉంది. చిన్న వయసులోనే మద్రుల్ చనిపోవడతో ఆయన స్వగ్రామం చిలకలూరిపేటలో విషాధం అలుముకుంది.
మ్రుదుల్ మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు అక్కడి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ముందుకొచ్చింది. అమెరికాలోని తెలుగు వారి ఆర్థిక - సామాజిక అవసరాలు తీర్చడంలో నాట్స్ ముందుంటుంది. వారి హెల్ప్ లైన్ కు ఎవరైనా ఫోన్ చేస్తే వారికి సహాయ సహకారాలు అందిస్తుంటుంది. ఇలాంటి కష్ట సమయంలో ముద్రుల్ కుటుంబానికి నాట్స్ అండగా నిలిచి మృతదేహాన్ని భారత్ కు రప్పిస్తుండడంపై ముద్రుల్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.