తెలుగులో ఆ మధ్య పలు సినిమాల్లో మెరిసిన హీరోయిన్ నవనీత్ కౌర్ ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి ఎంపీగా కొనసాగుతున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె అమరావతి పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీచేసి గెలిచి సంచలనం సృష్టించారు. నవనీత్ కౌర్ భర్త రవి సైతం మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
తాజాగా నవనీత్ కౌర్ భర్త.. ఎమ్మెల్యే రవికి ఆగస్టు 6న కరోనా సోకింది. దీంతో కుటుంబంలోని వారందరికీ టెస్టులు చేయగా.. మొత్తం 12మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇందులో నవనీత్ కౌర్ తోపాటు ఆమె అత్తామామలు.. పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న నవనీత్ కౌర్ ఆరోగ్యం బాగా క్షీణించినట్టు తెలిసింది. దీంతో ఆమెను హుటాహుటిన నాగర్ పూర్ లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటిదాకా ఆమె ముంబైలోని అమరావతి ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం నవనీత్ కౌర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
2019లో బీజేపీ తరుఫున అమరావతి ఎంపీ టికెట్ ను నవనీర్ కౌర్ ఆశించారు. కానీ ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే అయిన భర్త రవి ప్రోత్సాహంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి నవనీత్ గెలిచారు.