దేశ హితం కోసం పని చేసే డిఫెన్స్ వర్గాలు తీసుకొనే కొన్ని నిర్ణయాల కారణంగా జరిగే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే..ఈ సంస్థలతో వచ్చిన చిక్కేమిటంటే.. సాధారణ విషయాల్ని గోప్యంగా ఉంచటం.. సమాచారాన్ని సరిగా ఇవ్వకపోవటవంతో లేనిపోని కన్ఫ్యూజన్ అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి విశాఖ ప్రజలకు ఎదురు కానుంది.
విశాఖపట్నానికి వచ్చే ప్రయాణికులతో పాటు.. విశాఖ ప్రజలకు నేవీ ఒక షాకిచ్చింది. నవంబరు నుంచి ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.30 గంటలవరకూ.. ప్రతి మంగళవారం.. బుధవారం రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ విశాఖపట్నానికి వచ్చే విమానాల్ని నిలిపివేయాలని కోరింది.
ఏవియేషన్ విభాగానికి విశాఖ నేవీ పంపిన ఈ లేఖలో ఈ కొత్త పరిమితులు ఎంత కాలం అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయకపోవటం గమనార్హం. దీంతో.. దేశ.. విదేశీ రాకపోకల మీదా.. పర్యాటకం మీదా తీవ్ర ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. సాధారణంగా విశాఖకు వచ్చే ప్రయాణికులు ఉదయాన్నే వచ్చి రాత్రికి తిరిగి వెళ్లే వారు కానీ.. పొద్దున్నే విశాఖకు వచ్చే పర్యాటకులు ఎక్కువమంది ఉంటారు. సరిగ్గా ఆ సమయంలోనే ఫ్లైట్స్ మీద నిషేధం విధించాలని కోరటంతో విశాఖ పర్యాటకానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు.
ఇటీవల కాలంలో విశాఖకు విమాన ప్రయాణికుల సంఖ్య అంకతంతకూ పెరుగుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే నేవీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కారణంగా విశాఖకు రావాలనుకునే వారికి తీవ్ర ఇబ్బందులకు గురి కావటం ఖాయమంటున్నారు. ఒకవేళ దేశ రక్షణ అవసరాల కోసం తప్పదనుకుంటే.. అదెంత కాలమన్న విషయాన్ని స్పష్టం చేస్తే సర్దుకోవచ్చు. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. సమాచారాన్ని ఇవ్వకుండా ఫ్లైట్స్ ను ఆపేయాలని కోరటం సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.