ఎఫెక్ట్ ఎంత?; ఇది.. నాయిని వారి ‘‘భరోసా’’

Update: 2016-05-07 15:17 GMT
ఈ మధ్య కాలంలో మహిళలకు ఎంత కఠినమైన సవాళ్లు ఎదురవుతున్నాయో తెలిసిందే. కలలో కూడా ఊహించని దారుణాలకు వారు బలి అవుతున్న దుస్థితి. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఇబ్బందులకు గురి అవుతున్న మహిళలకు.. చిన్నారులకు రక్షణ కల్పించేందుకు తెలంగాణ సర్కారు తాజాగా మరో కార్యక్రమాన్ని షురూ చేసింది.

వివక్షకు గురి అవుతున్న మహిలలు.. ఆపదలో ఉన్న చిన్నారులకు రక్షణ కల్పించటమే దీని లక్ష్యంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ‘భరోసా’ అన్న పేరును పెట్టారు. వివక్షకు గురి అవుతున్న మహిళలు.. అత్యాచార బాధితులు.. చిన్నారులు ఇలా సమస్యలు ఎదురైన వారు ఎవరైనా సరే.. ఆదుకునేందుకు.. వారికి సాయం అందించేందుకు ఈ భరోసా కేంద్రం పనిచేయనుంది. దీనికి ఛైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహరించనున్నారు.

‘‘100’’ నెంబరుకు ఫోన్ చేసి భరోసా కేంద్రం ద్వారా రక్షణ పొందొచ్చని.. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ‘‘1098’’ నెంబరు ఏర్పాటు చేశామని చెబుతున్నారు. బాధితులకు సాయం అందించేందుకు ఈ నెంబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. మాటలు చెప్పిన రీతిలోనే భరోసా కేంద్రం పని తీరు ఉంటే అంతకు మించి కావాల్సిందేముంది?
Tags:    

Similar News