వారు.. అవార్డులు వెనక్కి తీసుకుంటున్నారు

Update: 2016-01-23 04:19 GMT
స్వతంత్ర్య భారతంలో చాలానే ఇష్యూలు జరిగినప్పటికీ ఎప్పుడూ స్పందించని రీతిలో రచయితలు.. మేధావులు పెద్ద ఎత్తున ప్రభుత్వం తమకు ఇచ్చిన పురస్కారాల్ని తిరిగి ఇచ్చేసిన వైనం దేశాన్ని కుదిపేయటం తెలిసిందే. దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయంటూ అవార్డుల్ని తిరిగి ఇచ్చేసే కార్యక్రమాన్ని ఆ మధ్యన పలువురు రచయితలు.. మేధావులు షురూ చేశారు. ‘అవార్డు వాపసీ’ పేరుతో చేపట్టిన కార్యక్రమానికి మేధావుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

ఇలా అవార్డులు తిరిగి ఇచ్చేసిన ప్రముఖులు దాదాపు 40 మంది ఉన్నారు. సాహిత్య అకాడమీకి తమ అవార్డులు పంపిస్తూ వారు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో తిప్పి పంపిన అవార్డుల్ని వెనక్కి తీసుకునే విషయంలో రచయితలు తమ మనసు మార్చుకోవటం గమనార్హం. మొత్తం 40 మందిలో 10 మంది తమ అవార్డుల్ని వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పారని.. మిగిలిన వారు అదే బాటలో ఉన్నట్లు చెబుతున్నారు.

తమకు పంపిన అవార్డులను తిరిగి సదరు అవార్డు గ్రహీతలకు పంపుతున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది. నయనతార సెహగల్ తో సహా పలువురు ప్రసిద్ధ రచయితలు.. రచయిత్రులు మనసు మార్చుకోవటం గమనార్హం. అయితే.. తమకు పంపిన 40 అవార్డుల్లో 10 మంది మాత్రం వెనక్కి తీసుకోవటం పక్కా అని తేల్చి చెబుతున్నారు. మిగిలిన వారు కూడా ఓకే అంటారని నమ్మకాన్ని సాహిత్య అకాడమీ ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News