కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్ రెడ్డి అనారోగ్యంతో హఠాత్ మరణం చెందడం అందరినీ షాక్ కు గురిచేసింది. 77 ఏళ్ల జైపాల్ నిమోనియా వ్యాధితో కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదయం ఆయన మరణించారు. రేపు జైపాల్ రెడ్డి అంతిమయాత్ర ఆయన ఇంటి నుంచి నిర్వహిస్తారు.
జైపాల్ మృతితో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించడానికి ప్రముఖులు తరలివస్తున్నారు. భావోద్వేగానికి గురి అవుతున్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
నాయిని నర్సింహారెడ్డి ఈ ఉదయం జైపాల్ భౌతిక కాయానికి నివాళులర్పించి భావోద్వేగానికి గురయ్యారు. మచ్చలేని నాయకుడు జైపాల్ అని.. ఇద్దరం కలిసి దేవరకొండ స్కూల్లో చదువుకున్నామని.. ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లామని గుర్తు చేసుకున్నారు.
ఇక జైపాల్ రెడ్డి తనకు రాజకీయ గురువు అని సీనియర్ నేత డి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థి దశనుంచే తనను ప్రోత్సహించారని.. ఆయన వల్లే తాను కాంగ్రెస్ లో చేరానని డీఎస్ చెప్పుకొచ్చాడు.
జైపాల్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన కృషి చాలా ఉందని.. ఆయన కోసం తెలంగాణలో ఘాట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. నెక్లస్ రోడ్ లో స్థలం కేటాయించాలని కోరారు.