కొంతకాలంగా టాలీవుడ్ లో ఓ ఆరోగ్యకరమైన సంస్కృతి మొదలైన సంగతి తెలిసిందే. గతంలో అగ్రహీరోల ఫ్యాన్స్ మధ్య వెర్బల్ వార్....చిన్న గొడవలు....జరిగేవి. ఎన్టీఆర్ - పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవలో ఓ పవన్ అభిమాని ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. రెండేళ్ల క్రితం భీమవరంలో ప్రభాస్ - పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవ....స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని సెటిల్ చేసే వరకు వెళ్లింది. అయితే, కొంతకాలంగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. టాలీవుడ్ అగ్రహీరోలు....ఒకరి ఫంక్షన్లకు మరొకరు రావడం....సన్నిహితంగా ఉండడంతో ఆటోమ్యాటిక్ గా ఫ్యాన్స్ మధ్య కూడా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, జనసేనలోకి ప్రభాస్ భీమవరం ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలపాల దినేష్ యాదవ్ చేరడం చర్చనీయాంశమైంది.
భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న సందర్భంగా దినేష్ ....జనసేనలో చేరాడు. దినేష్ కు పవన్ స్వయంగా పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ వంటి యువనేత నాయకత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తుందని తాను విశ్వసిస్తున్నానని, అందుకే జనసేనలో చేరానని దినేష్ చెప్పారు. దినేష్ తో పాటు మరి కొంత మంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా జనసేనలో చేరారు. అయితే, ఒక హీరో ఫ్యాన్స్ ....మరో హీరో పార్టీలో చేరడం ఇది కొత్తేమీ కాదు. సినిమాలను, రాజకీయాలను వేరుగా చూస్తూ బ్యాలెన్స్ చేసే అభిమానులూ ఉన్నారు. భవిష్యత్తులో మరింతమంది పవన్ కు మద్దతు తెలిపే అవకాశముందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.