ఆపరేషన్ చేసి , కడుపులో కత్తెర పెట్టి కుట్టేశారు !

Update: 2020-10-15 23:30 GMT
వరంగల్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరో సారి బయటపడింది. వైద్యం కోసం వెళ్లిన రోగికి ఆపరేషన్‌ చేసి.. అతడి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేసిన ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వెలుగులోకి వచ్చింది. ఓ పేషంట్‌కు ఆపరేషన్ చేసిన తర్వాత అతడి కడుపులోనే దాన్ని మర్చిపోయారు. ఆ వ్యక్తికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇది బయటపడకుండా గుట్టుగా ఆపరేషన్ చేసి తీసేందుకు ఏర్పాట్లు చేసినా అందరికి తెలిసింది. దీనితో వైద్యుల నిర్లక్ష్యం పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివారాల్లోకి వెళితే..బెల్లంపల్లిలోని శాంతిగనికి చెందిన రాజు కొన్ని రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ సమయంలో డాక్టర్లు అతని కడపులో కత్తెరను మర్చిపోయి కుట్లు వేసేశారు. కొన్ని రోజులకు అతడికి కడుపునొప్పి రావడంతో మరోసారి ఓ ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకువచ్చారు. బుధవారం ఎక్స్రే తీయగా కడుపులో కత్తెర ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు తలపట్టుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా దాచే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బైటపడ్డాడని అదే ఏదన్నా జరగరానిది జరిగిదే ప్రాణాలే పోయేవి కదా..ఆపరేషన్ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:    

Similar News