మరో ఆసక్తికర అంశం తెర మీదకు మళ్లీ వచ్చింది. అప్పుడెప్పుడో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరిగి.. చరిత్రలో మిస్టరీగా మిగిలిన విషయాన్ని తాజాగా కదపటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ సతీమణి ఎడ్వీనాల మధ్య ఉన్న రిలేషన్ పై తాజాగా ఒక పుస్తకంలో చర్చించారు.
అయితే.. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరో కాదు.. మౌంట్ బాటన్.. ఆయన సతీమణి ఎడ్వీనాల కుమార్తె పమేలా హిక్స్ నీ మౌంట్ బాటన్. తాజాగా తాను రాసి డాటర్ ఆఫ్ యాన్ ఎంఫైర్: లైఫ్ యాజ్ ఎ మౌంట్ బాటన్ అనే పుస్తకంలో వీరి మధ్య ఉన్న అనుబంధంపై ఆమె కొత్త విషయాన్ని తెర మీదకు చెప్పారు.
వాస్తవానికి నెహ్రూ.. మౌంట్ బాటన్ సతీమణి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అంటూ చాలామంది చాలా రకాలుగా ప్రస్తావిస్తుంటారు. అయితే.. నిజంగా అలాంటిది ఉందా? అంటే.. మౌంట్ బాటన్ సతీమణితో నెహ్రూ క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని చూపిస్తుంటారు. అయితే.. ఈ విషయం మౌంట్ బాటన్ కుమార్తె దృష్టికి రావటం.. నిజంగా తన తల్లి.. నెహ్రు మధ్య ఉన్న బంధం ఎలాంటిదన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ఆమెకు వచ్చిందట.
దీంతో.. ఈ అంశంపై ఆమె దృష్టి సారించి.. ప్రయత్నించే ప్రయత్నం చేశారట. అందరూ అనుకున్నట్లుగా తన తల్లికి.. నెహ్రుకి మధ్య శారీరక సంబంధం లేదని ఆమె చెబుతోంది. నెహ్రు.. ఎడ్వీనాల మధ్య అద్భుతమైన అనుబంధం.. పరస్పర గౌరవాభిమానాలు ఉండేవి కానీ.. అందరూ అనుకున్న రిలేషన్ మాత్రం లేదంది.
నిజానికి వారిద్దరి మధ్య అవసరమైన ఏకాంతమూ వారికి లభించే పరిస్థితి లేదని పేర్కొంది. వారి చుట్టూ ఎప్పుడు సిబ్బంది.. పోలీసులు ఎవరో ఒకరు ఉండేవారని తన పుస్తకంలో పేర్కొంది. నెహ్రు రాసిన లేఖల్లో అమ్మ గురించి ఆయన ఫీలింగ్స్ చదివాక వారిద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్లుగా ఆమె వెల్లడించారు.
మౌంట్ బాటన్ తో 17 ఏళ్ల వయసులో పమేలా భారత్ కు వచ్చారని చెప్పిన.. ఆమె కుమార్తె.. భారత్ నుంచి వెళ్లిపోయే ముందు తనకిష్టమైన ఎమరాల్డ్ ఉంగరాన్ని నెహ్రుకు ఇవ్వాలని ఎడ్వీనా అనుకుందని.. అయితే అందుకు ఆయన అంగీకరించరని తెలిసి.. ఆయన కుమార్తె ఇందిరకు ఆ ఉంగరాన్ని ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తాను కోరుకున్న వ్యక్తిత్వం..మేధస్సు నెహ్రులో తన తల్లి చూసినట్లుగా ఎడ్వీనా కుమార్తె తాజా పుస్తకంలో పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగిన చర్చ.. తాజా పుస్తకంతో మరోసారి తెర మీదకు వచ్చినట్లుగా చెప్పక తప్పదు.