ప్రపంచంలో ఏకైక హిందూ దేశంగా ఉన్న నేపాల్ లౌకికదేశంగా మారిపోయి గత వారం నూతన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టినట్లు, ఇందుకు సంబంధించిన చారిత్రాత్మక కొత్త రాజ్యాంగాన్ని నేపాల్ ఆమోదించినట్లు ప్రకటన వెలువడింది. అయితే నూతన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేపాల్ లో ఆందోళనలు ఉదృతమయ్యాయి. నిరసనకారులు ఇంధన సమస్యను సృష్టించే దేశంలోని కీలకమైన చెక్ పోస్టు వద్ద రోడ్డును బ్లాక్ చేశారు. భారత్ సరిహద్దులోకి కీలకమైన బిర్ గంజ్ చెక్ పోస్టును మూసివేయడం వల్ల దేశంలోని పెట్రో ఉత్పత్తులు సహా పలు ముఖ్యమైన వస్తువుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో నేపాల్ దేశంలో ఇంధన సమస్య తలెత్తింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ముఖ్యనగరాలలో వాహనదారుల కోసం నేపాల్ సర్కార్ ఒక ప్రత్యేక లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ విధానం ద్వారా వాహనదారులు తమ వాహనాన్ని రోజు విడిచి రోజు మాత్రమే రోడ్లపైకి తీసుకురావలసి ఉంటుంది. అంతే కాకుండా విదేశాల నుంచి నేపాల్ కు వచ్చే విమానాలు దేశంలో కాకుండా బయటనే ఇంధనాన్ని నింపుకోవాలని నేపాల్ కోరుతోంది.
కొత్త రాజ్యాంగం ప్రకారం లౌకికత్వానికి అంతే ఓకే అని ప్రకటనలు చేసినప్పటికీ...అక్కడ పరిస్థితులు సద్దుమణగలేదు. 1996లో మావోయిస్టులు ప్రారంభించిన అంతర్యుద్ధం దాదాపు 15 వేల మందికి పైగా ప్రాణాలు బలితీసుకుని 2006లో ముగిసింది. ప్రపంచంలో మెజార్టీ హిందూ ప్రజలున్న ఏకైక దేశంగా వున్న నేపాల్ జనాభాలో 80 శాతం మంది హిందువులే. ఇప్పటివరకూ హిందూ దేశంగా పేరు తెచ్చుకున్న నేపాల్ కొత్త రాజ్యాంగం ప్రకారం లౌకిక దేశంగా మనుగడ సాగిస్తుంది. అయితే కొత్త రాజ్యాంగంలో తమకు ఏ మాత్రం ప్రాతినిధ్యం కల్పించలేదంటూ మాదేశీ - థారు తెగల ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో తుది సమాచారం అందే సమయానికి 100 మంది చనిపోయినట్లు సమాచారం.