దేశ జనాభాలో యువత అధికంగా ఉంటే....ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయితే, ఆ దేశంలో ఉండే ఉపాధి - సామాజిక - ఆర్థిక పరిస్థితులను బట్టి యువత సంతోఫంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. అయితే, రకరకాల కారణాల వల్ల పలు దేశాల్లో చాలామంది యువత డిప్రెషన్ - అసహనం - క్షణికావేశం వంటి కారణాలతో సంతోషంగా లేరు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ఏ దేశంలో యువత సంతోషంగా ఉన్నారో తెలుసుకునేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో నెదర్లాండ్స్ యువత అందరి కంటే సంతోషంగా ఉన్నారని తేలింది.
సంతోషకరమైన పరిస్థితులు మధ్య ఆ దేశంలోని యువత జీవిస్తున్నట్లు ఐరాస తెలిపింది. ప్రపంచ సంపన్న దేశాల్లో సంతోషం, ఆరోగ్యం, మంచి విద్య వంటి అనేక అంశాలపై 2017 సంవత్సరానికి గాను యూనిసెఫ్ నిర్వహించిన సర్వేలో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో నిలిచింది.
ఆ దేశంలో యువతతో పాటు ఆడపిల్లలు - మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల పట్ల హింస పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశంలో చిన్న చిన్న విషయాలు మినహా మహిళలు పెద్దగా ఇబ్బందిపడిన ఘటనలు లేకపోవడం విశేషం.
స్థూలకాయం బారిన పడ్డవారి సంఖ్య కూడా అక్కడ తక్కువగా ఉంది. నెదర్లాండ్స్ లో పని వేళలే వారి సంతోషకరమైన జీవితానికి కారణమని తేలింది. నెదర్లాండ్ (డచ్) ప్రజలు రోజుకు 16 గంటల సమయాన్ని తినడం, నిద్రపోవడం, కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తారు. అక్కడి ప్రజలు ఒక వారంలో కేవలం 30.3 గంటలు మాత్రమే పనిచేస్తారట. అంటే శని, ఆదివారాలు మినహాయిస్తే....రోజులు 6గంటలు పనిచేస్తారు. అవసరాన్ని బట్టి కేవలం 0.5శాతం మంది మాత్రమే ఓటీ పనిచేస్తారని సర్వేలో తేలింది. తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు అక్కడి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారట. తమ తల్లిదండ్రులతో యువత అన్ని విషయాలు చర్చిస్తారని, తల్లిదండ్రులతో వారికి మంచి అనుబంధం ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఇటువంటి నేపథ్యంలోనే నెదర్లాండ్ యువత....ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని తేలింది.