ప్రశ్నించడమే కాదు.. తనకు నైతికత.. నిబద్ధత రెండు కూడా ఉన్నాయని పదే పదే చెప్పే జనసేన అధినే త పవన్ కళ్యాణ్.. ఒకవైపే చూస్తున్నాడనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. దాదాపు ముగి సిపోయిందని అనుకున్న సమస్యను కూడా కెలికి.. వెలికి తీసేందుకు ఆయన ప్రయత్నించడాన్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. తాజాగా విశాఖ ఉక్కు కోసం.. దీక్ష చేసిన పవన్.. అనేక అంశాలను స్పృశించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
అదేసమయంలో సభకు సంబంధం లేని అంశాలను కూడా పవన్ తెరమీదికి తెచ్చారు. అసెంబ్లీలో చం ద్రబాబును ఆయన సతీమణిని దూషించిన ఘటనను పవన్ ప్రస్తావించి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ను రౌడీలుగా, గూండాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే.. ఇలాంటి అత్యంత సున్నితమైన విషయాల్లో పవన్ కళ్యాణ్.. ఒకవైపు నుంచి వచ్చిన వాదననే పరిగణనలోకి తీసుకోవడాన్ని నెటిజన్లు తప్పు బడుతున్నారు.
అంతేకాదు.. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే.. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమైనా చేసి ఉండాలి కదా! అనేది వీరి ప్రశ్న. పోనీ.. తెలుసుకునే ప్రయత్నం చేయలేక పోయినా.. అటు అధికార పార్టీ నేతలు.. ఎమ్మెల్యేలు.. ఏమీ జరగలేదని.. చెప్పారు. పోనీ.. ఈ విషయాన్ని పక్కన పెట్టినా.. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఒకరిద్దరు మంత్రులు కూడా తెరమీదికి వచ్చి బహిరంగంగా.. ఈ ఘటనను తప్పుబట్టారు.
తాము అలా వ్యాఖ్యానించ లేదని.. అయినప్పటికీ.. క్షమాపణలు చెబుతున్నామని.. ఒకరంటే.. మరొకరు కన్నీటితో పాదాలు కడుగుతా మని.. వ్యాఖ్యానించారు. సో.. ఈ విషయంలో ఇంత జరిగిన తర్వాత.. మళ్లీ పవన్ వంటి విజ్ఞత ఉన్నవారు ... పాతికేళ్ల దూరదృష్టి ఉన్న వారు.. ఇలా మరోసారి దీనిని తవ్వితీయడం సమంజసమా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. టీడీపీ అధినేత, బాధితులు అయిన.. చంద్రబాబు ఈ గాయం నుంచి ఇప్పుడిప్పుడే.. కోలుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ.. ఇప్పుడు ఆయన గాయాన్ని మరోసారి తట్టిలేపినట్టు అవడం లేదా..? ఇది బాబుకు మంచి చేస్తున్నట్టా? చెడు చేస్తున్నట్టా? పవన్ అంటున్నారు పరిశీలకులు.