ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటి అని ఆ మాత్రం రాజకీయ విషయం ఉన్న ఎవరిని అడిగినా ఇట్టే జవాబు చెబుతారు. కమలం ఉనికి పోరాటం చేస్తుందని కూడా చెబుతారు. అలాంటిది ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న సోము వీర్రాజుకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ పూర్తిగా తెలియవు అనుకుంటే పొరపాటే. మరి అన్నీ తెలిసి ఆయన మేమే రేపటి ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేస్తామని చెబుతారు.
ఏదైనా ఆత్మ విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం మంచిది కాదు, పైగా చేటు చేస్తుంది. మరి సోముకు ఇవన్నీ తెలియదా. ఆయన ఇంతకు ముందు స్టేట్మెంట్స్ కి లేటెస్ట్ స్టేట్మెంట్స్ కి చాలా తేడా కనిపిస్తోంది. గతంలో ఆయన ఏపీలో బలమైన శక్తిగా అవతరిస్తామని అనే వారు. ఇటీవల కాలంలో మాత్రం ఏపీలో మేమే పవర్ లోకి వచ్చేస్తున్నామని సౌండ్ చేస్తున్నారు.
నిజంగా ఏపీలో బీజేపీకి అంత సీన్ ఉందా అని అంతా అనుకుంటున్న పరిస్థితి. పక్కనున్న తెలంగాణాలో బీజేపీకి ఎంతో కొంత బలం ఉంది. అక్కడ బీజేపీ ప్రెసిడెంట్ మండే ఎండలో పాదయాత్ర చేస్తూ చాలానే కష్టపడుతున్నారు. అయినా కూడా వచ్చేది మా సర్కారే అని నిబ్బరంగా చెప్పలేకపోతున్నారు. రాజకీయాలలో ఉన్నవారు మేమే పవర్ లోకి వస్తున్నామని క్యాడర్ కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు కానీ మరీ అతి అయితేనే అసలుకు ఎసరు పడుతుంది అంటున్నారు.
ఇక సోము వీర్రాజు వీరావేశం అంతా టీడీపీ మీద చూపిస్తున్నారు. అదే విధంగా వైసీపీని నిందిస్తూ టీడీపీని ఆడిపోసుకుంటున్నారు. కుటుంబ పార్టీలు ఏపీలో ఉన్నాయని ఆయన చెబుతున్నారు. మరి నాడు ఎన్టీయార్ తో పొత్తు పెట్టుకున్నపుడు కానీ తరువాత రెండు మూడు సార్లు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్నపుడు కానీ కుటుంబ పార్టీలు అన్న మాట తోచలేదా సోమూ అంటే ఏం జవాబు చెబుతారో.
నాడు అవసరం కాబట్టి అన్నీ పక్కన పెట్టి మరీ పొత్తులకు దిగిపోయారు. ఇపుడు మాత్రం వద్దు అంటున్నారు ఎందుకంటే నాటి కంటే నేడు బీజేపీకి జాతీయ స్థాయిలో బలం బాగా ఉంది. ఇక ఏపీలో టీడీపీ కొంత తగ్గినట్లుంది. ఆ మాత్రానికే అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు అంటూ అంతా ఇపుడే గుర్తుకు వచ్చినట్లుగా సోము చేస్తున్న హడావుడి మీదనే చర్చ సాగుతోంది.
ఇక త్యాగాలు మేము చేయడానికి సిద్ధంగా లేమని సోము అంటున్నారు. తమ దారి రహదారి అని కూడా చెబుతున్నారు. ప్రజలలో ఆదరణ మెండుగా ఉంటే ఒంటరిగా పోటీ చేయడంలో తప్పేమీ లేదు, అయితే చంద్రబాబు అన్నట్లుగా త్యాగాలు మేము చేయలేమని చెబుతున్న సోము పట్టువిడుపులు లేకపోతే ఏకంగా రాజకీయ ఆశలను కూడా త్యాగం చేసుకోకతప్పదు అన్న సత్యాన్ని కూడా గ్రహించాలని అంటున్నారు.
ఏది ఏమైనా సోముది అత్యాశగానే అంతా చూస్తున్నారు. ఏపీలో బలమైన పార్టీలుగా వైసీపీ టీడీపీ ఉన్నాయి. జనసేన కూడా టీడీపీతో పొత్తునకు సై అంటున్న సంకేతాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో మాదే అధికారం అంటూ కమలనాధులు కలలు కనడం అంటే ఈ టైమ్ లో జోక్స్ అవసరమా సోమూ అనే అంతా అంటున్నారు.