నెల రోజుల్లో ల‌క్ష కోట్లు.. యూపీకే కేటాయించిన మోడీ.. నెటిజ‌న్ల ఫైర్‌

Update: 2021-12-18 13:28 GMT
వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌(యూపీ) ఎన్నిక‌లు వున్నాయి. ఇక్క‌డ మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందు కు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంది. రాజ‌కీయ పార్టీగా.. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. అధికారంలో ఉన్న పార్టీ కాబ‌ట్టి.. అక్క‌డ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేయొచ్చు. అయితే.. ఈ క్ర‌మంలో దేశం మొత్తం క‌డుతున్న ప‌న్నుల్లో సింహ‌భాగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం.. ఒక్క ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే కేటాయించ‌డం.. ఎన్న‌డూ లేనిది.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ సాధ్యం కానిది .. వ‌రు స‌పెట్టి వేల కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డం.. ఇప్పుడు ప్ర‌ధాని మోడీని విమ‌ర్శ‌ల‌కు గురిచేస్తోంది.

గ‌త 30 రోజుల్లో దాదాపు ల‌క్ష కోట్ల కు పైగా సొమ్ముతో కూడిన అభివృద్ధి ప‌నుల‌కు ఇక్క‌డ మోడీ.. శంకుస్థా ప‌న‌లు చేశారు. ఇటీవ‌లే.. దివ్య కాశీ.. భ‌వ్య‌ కాశీ.. అంటూ.. 33 వేల కోట్ల రూపాయ‌ల విలువైన ప్రాజెక్టును ప్రారంభించారు. దీనికి ముందు.. రూ.46 వేల కోట్ల విలువైన‌.. అంత‌ర్జాతీయ హ‌రిత విమానాశ్ర‌యానికి... శంకుస్థాప‌న చేశారు. ఇక‌, ల‌ఖ‌న్‌వు.. ఢిల్లీని క‌లిపే.. అతి పెద్ద జాతీయ ర‌హ‌దారికి కూడా శంకుస్థాప‌న చేశారు. ఇక‌, ఇప్పుడు తాజాగా. రూ.36,000 కోట్లతో నిర్మిస్తున్న గంగా ఎక్స్ ప్రెస్ వేకు మోడీ భూమి పూ జ చేశారు. ఇలా.. ఈ శంకుస్థాప‌న‌లు చేసిన(ప్రారంభించిన‌వి కాదు) ప్రాజెక్టుల విలువే.. రూ.లక్ష కోట్ల వ‌ర‌కు ఉంది.

దీంతో ఈ విష‌యం... ఇప్పుడు వివాదంగా మారింది. ఒక‌వైపు.. త‌మ‌ను ఆదుకోవాలంటూ.. ఏపీ, తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు.. ఒడిసా.. వంటి రాష్ట్రాలు కేంద్రం ముందు ప్రాధేయ‌ప‌డుతున్నాయి. అయితే.. ఈ రాష్ట్రాల‌కు నిధులు ఇచ్చేందుకు రూపాయి కూడా విద‌ల్చ‌ని.. మోడీ స‌ర్కారు వారానికి ఒక‌టి చొప్పున రూ. వేల కోట్ల ఖ‌ర్చ‌య్యే.. ప్రాజెక్టుల‌కు యూపీలో శంకుస్థాప‌న‌లు చేస్తుండ‌డంపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. కేవ‌లం ఎన్నిక‌ల కోసం.. మ‌రోసారి అధికారం ద‌క్కించుకోవ‌డం కోసం.. దేశ ప్ర‌జ‌ల సంప‌ద‌ను యూపీలో కుమ్మ‌రిస్తున్నారా? మోడీజీ. అంటూ.. నిప్పులు చెరుగుతున్నారు.

అనేక రాష్ట్రాల్లో అనేక కేంద్ర ప్ర‌థ‌కాలు.. పెండింగులో ఉన్నాయి. ఇప్ప‌టికే వాటిని ప్రారంభించారు. మ‌ధ్య‌లోనే నిలిచిపోయాయి. అలాంటి వాటికి నిధులు ఎందుకు ఇవ్వ‌రు? అని ప్ర‌శ్నిస్తున్నారు. దేశంలో మీకు కేవ‌లం యూపీనే క‌నిపిస్తోందా? మోడీ సార్‌? అని నెటిజ‌న్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ ఆగ్ర‌హానికి కార‌ణం స్పష్టంగా క‌నిపిస్తుండ‌డంతో.. బీజేపీ నేత‌లు ఎవ‌రూ స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News