సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తరచూ కార్యక్రమాల్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. గతానికి భిన్నంగా ఆయన ముఖాముఖి కార్యక్రమం కాస్త సీరియస్ గా సాగింది. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చకు తెర తీసేలా మారాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రైవేటుకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పోటీ పడగలవు? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీకా కంపెనీల వద్ద ప్రైవేటు సంస్థలు భారీ మొత్తానికి టీకాను కొనుగోలు చేస్తున్నయని.. అలాంటివేళ.. రాష్ట్రాలు వాటితో ఎలా పోటీ పడగలవని ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి రూ.150కు ఇచ్చే వ్యాక్సిన్ ను.. రాష్ట్రాలు రూ300 కొంటుంటే.. ప్రైవేటు సంస్థలు రూ.600లకు కొంటున్నాయని చెప్పారు. ఇలాంటివేళ.. ప్రైవేటుతో రాష్ట్రాలు ఎలా పోటీ పడగలవని ప్రశ్నిస్తున్నారు.
వ్యాక్సిన్ అసలు ధర రూ.400 ఉంటే.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.1400లు ఎందుకు తీసుకుంటున్నారన్న ప్రశ్నకు స్పందించిన కేటీఆర్.. వేర్వేరు ధరలకు వేర్వేరు సంస్థలకు టీకాలు అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సంస్థలు తయారు చేసిన టీకాల్లో 85 శాతం కేంద్రం తీసుకుంటుందని.. మిగిలిన 15 శాతానికి రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటు ఆసుపత్రులు పోటీ పడుతున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్ విషయానికి వస్తే కేంద్రం రూ.400 కొంటే.. ప్రైవేటు ఆసుపత్రులు రూ.1200లకు కొంటున్నాయని.. రాష్ట్రాలు వాటితో పోటీ పడలేవని పేర్కొన్నారు.
రైతుబంధు పథకం నుంచి ఎన్నో పథకాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టే తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలకు ప్రాణావసరమైన వ్యాక్సిన్ విషయంలో ఆర్థికంగా భారమైతే అవ్వొచ్చు.. భారీ ఎత్తున కొనుగోలు చేస్తే పోయేదేముంది? లేదంటే.. టీకా తయారీ సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడి ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ధరలకు కాస్త తక్కువగా తమకు అందించాలని కోరితే.. మరీ అంత కఠినంగా ఉండే అవకాశం లేనట్లే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాల్ని తాత్కాలికంగా పక్కన పెట్టి.. వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేయగలిగితే.. పెట్టిన ఖర్చును వడ్డీతో సహా పన్ను ఆదాయంగా సమకూర్చుకునే వీలుంది. కేంద్రం విధించిన పాలసీ బాగోలేదు సరే.. ఆపేరు చెప్పి కాడి వదిలేయటం ఏమిటి కేటీఆర్ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.