యాపిల్ ఫీచ‌ర్ ల‌పై నెటిజ‌న్ల ట్రోలింగ్!

Update: 2018-09-13 16:49 GMT
యాపిల్ సంస్థ అట్ట‌హాసంగా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐఫోన్ ఎక్స్‌ సీ (ఐఫోన్) - ఐఫోన్ ఎక్స్ ఎస్‌ - ఐఫోన్ ఎక్స్ ఎస్‌ మ్యాక్స్‌ ను రిలీజ్‌  చేసిన సంగ‌తి తెలిసిందే. భారీ ధ‌ర‌తో మార్కెట్ లోకి వ‌చ్చిన ఈ ఐఫోన్ సిరీస్ లో తొలిసారిగా డ్యూయ‌ల్ సిమ్ ను ప్ర‌వేశ పెట్టారు. టెక్‌ ప్రపంచంలో సెప్టెంబర్‌ 12.. ఓ ఐకానిక్‌’ డే అంటూ ఐఫోన్లతో పాటు ఆపిల్‌ వాచ్‌ సిరీస్ 4ను కూడా మార్కెట్ లోకి తెచ్చారు. కింద ప‌డ‌డానికి ముందే హెచ్చరించే చిప్‌ - గుండె కొట్టుకునే వేగాన్ని లెక్కించ‌డం, 30 సెకన్లలో ఈసీజీ  తీయ‌డం వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. అయితే, ఈ సరికొత్త ఆపిల్‌ ప్రొడక్ట్ లపై సోషల్‌ మీడియా ఓ రేంజ్ లో ట్రోలింగ్ జ‌రుగుతోంది. డ్యూయ‌ల్ సిమ్ వాడ‌డం మొద‌లు పెట్టిన ఇన్నేళ్ల‌కు యాపిల్ లో డ్యూయ‌ల్ సిమ్ ప్ర‌వేశ‌పెట్టి....ఆ కంపెనీ జ‌బ్బ‌లు చ‌రుచుకుంటోందంటూ...నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.

2018 యాపిల్‌ వాచ్‌ సిరీస్ 4లో ఈసీజీ ఫీచర్ ఉంద‌ని, 2019 లో యాంజియోప్లాస్టీ - 2020 లో బైపాస్‌ సర్జరీ - 2021లో అంత్యక్రియల ఏర్పాటు ఫీచర్లు ఉంటాయ‌ని జోకులు పేలుస్తున్నారు. 2018లో డ్యూయ‌ల్ సిమ్ ఫీచ‌ర్ తెచ్చిన యాపిల్ ఇంకా  2012లోనే ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. అవే ఫీచర్లతో  ఆండ్రాయిడ్‌ ఫోన్ లు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయ‌ని - వేలు పెట్టి ఐఫోన్ కొంటున్నార‌ని ఓ సెటైరిక‌ల్ పిక్ వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు, కొత్త ఐఫోన్‌ మోడల్స్ మార్కెట్లోకి వ‌చ్చిన సంద‌ర్భంగా పాత ఐఫోన్‌ వేరియంట్ల ధ‌ర‌ల‌ను ఆ సంస్థ‌ భారీగా తగ్గించింది.  దేశీయ మార్కెట్‌ లో ఆపిల్‌ ఐఫోన్‌ 6ఎస్‌ 32జీబీ వేరియంట్‌ రూ.29,900కే లభ్యమవుతుంది. ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ బేస్‌ వేరియంట్ 34,900 రూపాయల నుంచి ప్రారంభమవుతోంది. ఐఫోన్‌ కొత్త ధరలను తన వెబ్‌ సైట్‌ లో ఆపిల్ అప్‌ డేట్‌ చేసింది. మ‌రోవైపు - ఐఫోన్‌ 6ఎస్‌ - ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌ - ఐఫోన్‌ 10 లను అమెరికాలో నిలిపివేస్తున్నట్టు ఆపిల్ తెలిపింది. అయితే, భారత్‌లో కేవలం ఐఫోన్‌ ఎస్ ఈ నే నిలిపివేసింది. మిగతా మూడు ఐఫోన్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.
Tags:    

Similar News