టీమిండియా వైవిధ్య బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే వీళ్ల వివాహం జరిగింది. ప్రస్తుతం బుమ్రా సెలవులో ఉన్నారు. ఇదిలా ఉంటే సంజనా మాత్రం డ్యూటీలో చేరింది. స్టార్ స్పోర్ట్స్ లో సంజన యాంకర్ గా పనిచేస్తున్నది. ప్రస్తుతం టీమిండియా రెండో వన్డే సందర్భంగా సంజన టీవీలో ప్రత్యక్షమయ్యారు. మార్చి 15న గోవాలో వీళ్ల వివాహం జరిగింది. పెళ్లైన కొద్దిరోజులకే సంజన విధులకు హాజరు కావడం గొప్ప విషయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అదే విధంగా బుమ్రా మీద కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు.
‘మీ ఆవిడ విధుల్లోకి వస్తే మరి నువ్వేం చేస్తున్నావు బుమ్రా’ అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. సోషల్‌మీడియాలో ఇందుకు సంబంధించిన మీమ్స్.. కామెంట్లు వైరల్ గా మారాయి. "బుమ్రా ఇంకా హాలిడే మూడ్ లో ఉన్నట్టున్నావ్.. నీ భార్య డ్యూటీకి వచ్చింది’ అంటూ మరికొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఇంగ్లండ్ తో రెండో టెస్టు తర్వాత బుమ్రా.. బ్రేక్ తీసుకున్నాడు. ప్రస్తుతం సంజనాతో గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే అతడు ఐపీఎల్లో మళ్లీ ఆడనున్నాడు. నిజానికి బుమ్రా ఈ వన్డే సీరిస్ మొత్తం ఆడే అవకాశం లేదు. కానీ కొందరు ఆకతాయిలైన నెటిజన్లు అత్యుత్సాహంతో కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు నిన్న జరిగిన సెకండ్ వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, పాండ్యా బ్యాటింగ్‌తో అదరగొట్టినప్పటికీ.. భారత బౌలర్లు రాణించలేకపోయారు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు సైతం విఫలమయ్యారు. దీంతో ఇంగ్లండ్ విరుచుకుపడింది. పరుగుల వరద కురిపించింది. బౌలర్ ఎవరైనా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్వైర విహారం చేశారు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు. ఒకవేళ బుమ్రా ఈ వన్డేలో ఉండి ఉంటే ఇంగ్లండ్ ఓడిపోయేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.