ఆయనొక సీనియర్ నేత. ఉత్తర తెలంగాణలో అత్యంత సీనియర్ మంత్రిగా పేరు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ నేతలకు అందుబాటులో ఉంటాడనే పేరుంది. ప్రజలకు ఏ కష్టమొచ్చినా తన కష్టంగా భావించి వెంటనే వాలిపోతారని.. సమస్యను క్షణాల్లో తీర్చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఇదంతా మొన్నటి వరకు. ఇటీవల మంత్రి చుట్టూ ఒక కోటరీ చేరిందని.. ఓ నలుగురు వ్యక్తులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
ఆ సీనియర్ మంత్రి ఎవరో కాదు.. నిర్మల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రతి రోజూ వందల సంఖ్యలో జనం వస్తుంటారు. వ్యక్తిగత సమస్యలు మొదలుకొని అభివృద్ధి పనుల దాకా మంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటారు. మంత్రి గారు కూడా జనం సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపిస్తుంటారు కానీ.. జనం ఆ సమస్యలు చెప్పుకునేందుకే ఇబ్బందులు పడుతున్నారట. మంత్రిని వ్యక్తిగతంగా కలవనీయకుండా ఓ నలుగురు అడ్డుగోడగా నిలబడుతున్నారట. ఇటీవల వారి జోక్యం మితిమీరిపోయిందట.
ఈ విషయంపై టీఆర్ఎస్ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందట. మంత్రిని పర్సనల్ గా కలవనీయకుండా ఈ నలుగురూ అడ్డు పడుతున్నారని.. మంత్రి గారు ఎంత సేపు కుర్చీలో ఉంటే వీరూ అంత సేపు ఆయన పక్కనే ఉండి సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకోనీయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై పార్టీ నేతలు మంత్రికి కూడా ఫిర్యాదులు చేశారట. మంత్రి ఒక సందర్భంలో ఆ నలుగురిని హెచ్చరించారట. అయినా కొద్ది రోజులు మిన్నకుండి మళ్లీ తమ పైరవీలు కొనసాగిస్తున్నారట.
మంత్రికి సన్నిహితంగా ఉండే ఒక సహకార నేత నిర్మల్ నియోజకవర్గం సమస్యలను తనకు తెలియకుండా మంత్రి వద్దకు వెళ్లనీయడం లేదట. ఎల్లప్పుడూ మంత్రి చెంతనే ఉండి ఆ సమస్యలను ఆయనకు చేరనీయడం లేదట. తనకు తెలియకుండా మంత్రి వద్దకు వెళితే జీర్ణించుకోవడం లేదట. అలాగే.. పట్టణ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత కూడా మంత్రి వద్ద ఆధిపత్యం చెలాయిస్తున్నారట. తనకు తెలియకుండా పట్ణణ వ్యవహారాలు మంత్రి వద్ద పరిష్కారం కావని చెప్పుకుంటున్నారట. ఈ విషయంపై మంత్రి ఎదుటే నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట.
పార్టీకి అనుబంధంగా ఉన్న ఓ పోలీస్ సీనియర్ అధికారి కూడా మంత్రితో చనువుగా మెలుగుతున్నారట. కింది స్థాయి పోలీసు సిబ్బంది, అధికారులు తను చెప్పిందే వినాలన్నట్లుగా ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఆ అధికారి పాలనా వ్యవహారాల్లో కూడా తలదూర్చుతున్నారని పార్టీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. మంత్రికి సన్నిహితంగా మారిన మరో నేత సామాజిక కార్యక్రమాల పేరుతో మంత్రి వద్ద ఆధిపత్యం చెలాయిస్తున్నారట. వీళ్ల వల్ల సమస్యల పరిష్కారం అటుంచితే.. రహస్య వివరాలు కూడా బయటకు పొక్కుతున్నాయని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి మంత్రి గారు ఈ నలుగురినీ ఎలా కట్టడి చేస్తారో.