గులాబీ బాస్ కు ఇప్పుడో కొత్త కష్టం ఎదురైంది. జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పి.. అందుకు తగ్గట్లు కూటమి కట్టేందుకు పావులు కదిపిన ఆయన.. అందులో భాగంగా పలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో స్పేస్ ఉందని కేసీఆర్ భావిస్తుంటే.. అదే సమయంలో తెలంగాణలో అధికారంలోకి రావటానికి అవసరమైన స్పేస్ ఉందని మూడు ముఖ్యమైన పార్టీలు భావించటమే కాదు.. అందుకు తగ్గట్లు కార్యక్రమాల్ని మరింత పెంచేలా ప్లానింగ్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
వరుసగా రెండు దఫాలు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు వెగటు పుట్టిందని.. ఆయన పాలనపై వ్యతిరేకత ఎక్కువైందని.. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే.. తెలంగాణలో అధికారంలోకి రావటం ఖాయమన్న భావన కమలనాథులకు.. కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎక్కువైంది. అనూహ్యంగా ఇప్పుడు అలాంటి భావన ఆమ్ ఆద్మీ పార్టీలోనూ షురూ అయ్యింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు కొత్త తరహా ఆలోచనల్లోకి వెళుతోంది ఆమ్ ఆద్మీ పార్టీ.
సరిగా ఫోకస్ చేయాలే కానీ.. తెలంగాణలో కాలు పెట్టేందుకు.. తమ సత్తా చాటేందుకు ఈ చైతన్య గడ్డ తమకు స్వాగతం పలకటం ఖాయమని భావిస్తోంది. ఇలా ఎవరికి వారు తెలంగాణను లక్ష్యంగా చేసుకొని.. రాజకీయంగా తమ సత్తా చాటేందుకు వీలుగా ప్లాన్లు వేసుకుంటున్నారు. తెలంగాణలో ముందస్తుకు అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేసినా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మొత్తం ఆ దిశగానే ఉండటం గమనార్హం. మరో రెండు రోజుల్లో మొదలయ్యే ఏప్రిల్ లో తెలంగాణ తమ తదుపరి లక్ష్యంగా భావిస్తున్న మూడు పార్టీలు (బీజేపీ.. కాంగ్రెస్.. ఆమ్ ఆద్మీ) ఎవరికి వారుగా ప్రయత్నాల్ని ముమ్మరం చేయనున్నట్లు చెబుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లు మీద ఇప్పటికే ఐదు అంచెల ఉద్యమ కార్యాచరణను షురూ చేసిన కాంగ్రెస్.. ఏప్రిల్ నెల మొత్తం ఇదే అంశం మీద ఉద్యమించనుంది. అంతేకాదు.. దీనికి ముగింపుగా వరంగల్ లో భారీ రైతు సభను నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని తీసుకురావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏదోలా వరంగల్ బహిరంగ సభకు రాహుల్ గాంధీని తీసుకురాగలిగితే.. తమ ప్రయత్నం ఫలించటమే కాదు.. కాంగ్రెస్ కు ఈ సభ కొత్త శుభారంభాన్ని ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
కాస్త కష్టపడి.. కేంద్రం కరుణించి.. తమ అధినేతలు సరిగా ఫోకస్ చేస్తే.. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఉన్న ఏకైక పార్టీ తమదేనని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. సరైన ప్లానింగ్ తో ముందుకు వెళితే.. తమకున్న అవకాశాలు అన్ని ఇన్ని కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్లే ఏప్రిల్ 14న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీకి అత్యంత కీలకమైన అమిత్ షా వస్తారని.. రాష్ట్ర ప్రజలకు.. పార్టీ నాయకత్వానికి దిశా నిర్దేశం చేస్తారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. భద్రాద్రి రాములవారి కల్యాణానికి సైతం అమిత్ షా వచ్చే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణలో పాగా వేయటానికి తమకున్న అవకాశాల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టకూడదన్న గట్టి పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ఇదిలా ఉంటే.. స్వచ్ఛమైన పాలన.. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు పోలిన ప్రభుత్వం తెలంగాణలో రావాలంటే అందుకు నాయకత్వ మార్పు తప్పనిసరి అని చెబుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో తన జర్నీని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా పార్టీ నేత ఇందిరా శోభన్ తదితరులు ఏప్రిల్ 14 నుంచి పాదయాత్రను చేయాలని భావిస్తున్నారు. ఈ యాత్రను ఢిల్లీ సీఎం.. పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభిస్తారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఎవరికి వారుగా.. తెలంగాణలో పాగా కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాల్నిఇస్తాయో చూడాలి. ఇలా తెలంగాణను టార్గెట్ చేసుకొని పార్టీ కార్యకలాపాల్ని పెంచేలా చేస్తున్న ప్లానింగ్ సీఎం కేసీఆర్ కు కొత్త కష్టాల్ని తెచ్చి పెట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.