పంజాబ్ సీఎం చుట్టూ కొత్త వివాదం

Update: 2022-09-20 07:31 GMT
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ పై మరోకొత్త వివాదం మొదలైంది. జర్మనీలో లుఫ్తాన్సా విమానంలోకి ఎక్కేసమయంలో బాగా మందుతాగి తూలుతున్నారన్న కారణంతో విమానసిబ్బంది సీఎంను దింపేశారంటు అకాలీదళ్, ప్రతిపక్షలు గోల  మొదలుపెట్టాయి. ఎక్కడో జర్మనీలో ఏమి జరిగిందో ఇక్కడ ఎవరికీ తెలీదు. అయితే తాగిన కారణంగానే మాన్ ను విమానంలోకి దింపేసినట్లు జర్మనీలోని ఒక మీడియా కథనం ఇచ్చింది.

దాన్ని ఆధారంచేసుకుని అకాలీదళ్ తో పాటు ప్రతిపక్షాలు గోల మొదలుపెట్టాయి. జర్మనీ మీడియాలో వచ్చిన కథనానికే ఆధారంలేదు. దాన్నిపట్టుకుని పంజాబ్ లో ప్రతిపక్షాలు గోల చేయటమే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షాల ఆరోపణలను సహజంగానే అధికార ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) ఖండించింది. విమానంలో నుండి మాన్ ను దింపేయటంతో వేరే విమానం పట్టుకుని భారత్ చేరేసమయానికి బాగా ఆలస్యమైందంటు అకాలీదళ్ పదే పదే ఆరోపిస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తాజా వివాదంపై లుఫ్తాన్స్ యాజమాన్యం స్పందించింది. విమానం మారాల్సిన అవసరం రావటంతోనే భారత కు చేరాల్సిన విమానం ఆలస్యమైందని మాత్రమే చెప్పింది.

అంతేకానీ మాన్ మందుతాగి తూలిన కారణంగా విమానంలో నుండి సిబ్బంది దింపేసిన ఆరోపణలపై ఏమీ స్పందించలేదు. ప్రయాణీకుల వ్యక్తిగత విషయాల్లో గోప్యత పాటించాల్సిన అవసరం కారణంగా తాము ఇతర విషయాలపై స్పందిచేదిలేదని తేల్చిచెప్పేసింది.

అయితే లుఫ్తాన్సా సిబ్బంది చేసిన ప్రకటనలో ఒక విషయమైతే స్పష్టత ఉంది. అదేమిటంటే జర్మనీ నుండి భారత్ కు రావాల్సిన విమానాన్ని చివరినిముషంలో మార్చాల్సిన కారణంగానే విమానం భారత్ కు చేరుకోవటంలో ఆలస్యమైందని.

విమానం మారిన కారణంగానే ప్రయాణీకులందరు ఒక విమానంలో నుండి మరో విమానంలోకి మారినట్లు అర్ధమవుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అంతర్జాతీయ విమానాల్లో మందు సరఫరా చేస్తారు. కాబట్టి మందుతాగి తూలుతు విమానంలోకి ఎక్కిన కారణంగా మాన్ ను దింపేశారనటం కర్టెక్టనిపించటంలేదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News