ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నగరాల నుండి కరోనా గ్రామాల వరకు పాకేసింది. గత కొద్ది రోజులు రోజుకు కనీసం 10వేలకు తక్కువ కాకుండా కేసులు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 9,652 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,396 మందికి పాజిటివ్ అని తేలింది. దీనితో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,261కి పెరిగింది.
ఇక , రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరణాల సంఖ్య ఆందోళనకి గురిచేస్తుంది. తాజాగా ఈ రోజు 88 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది కరోనాతో కన్నుమూశారు. ఇప్పటివరకు మొత్తంగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 2,820కి పెరిగింది. గత 24 గంటల్లో 9,211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85,130 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,18,311 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 445, చిత్తూరులో 990, తూర్పు గోదావరిలో 1396, గుంటూరులో 895, కడపలో755, కృష్ణాలో 281, కర్నూలులో 830, నెల్లూరులో684, ప్రకాశంలో 725, శ్రీకాకుళంలో 405, విశాఖలో 928, విజయనగరంలో513, పశ్చిమ గోదావరిలో 805 కేసులు నమోదయ్యాయి.