కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు - చర్యలు తీసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని అధికారులందరినీ ఉరుకులుపరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉన్నాయి. అయితే తెలంగాణలో అందుతున్న వైద్య సేవలు బాగున్నాయని కరోనా బాధితుడు మెచ్చుకుంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఒక గదికి కేవలం ఇద్దరుని ఉంచి నిరంతరం వైద్యం అందిస్తున్నారని - వైద్యులు చేస్తున్న సేవలకు చేతులెత్తి మొక్కాలని పేర్కొన్నాడు.
యూకే లండన్ నుంచి భారత్ కు ఓ వ్యక్తి వచ్చారు. అనంతరం తెలంగాణకు చేరుకున్నాడు. హైదరాబాద్ లో నివసిస్తున్న సమయంలో జ్వరం రావడంతో ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు కరోనా సోకిందని నిర్ధారించారు. కరోనా సోకగానే కంగారుపడ్డానని - అనంతరం వైద్యులు చేసిన సేవలతో తాను త్వరలోనే కోలుకుంటానని ఆ కరోనా పాజిటివ్ ఉన్న ఆ వ్యక్తి చెప్పాడు. దీనికి సంబంధించి వీడియోను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో అందరూ ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
వైద్యులు విశేష సేవలు అందిస్తున్నారని వారికి చేతులెత్తి మొక్కాలని పేర్కొన్నారు. వైద్యులను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు సహకరించాలని - సామాజిక దూరం పాటించాలని, అందరూ బాధ్యతగా ఇళ్లల్లోనే ఉండాలని కోరాడు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు 67కి చేరాయి.