ఈ 2020 విషాద ఏడాదిగా మిగిలిపోయింది. ఇప్పటికే కరోనాతో ప్రపంచం తలకిందులైన పరిస్థితి. ఇంకా కరోనా వ్యాక్సిన్ విషయంలో క్లారిటీలేదు. ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ప్రజలు వింతవ్యాధి బారిన పడ్డారు. 600 మందికి ఈ వింత రోగం సోకింది. ముగ్గురు ప్రాణాలు పోయాయి. ఇంతవరకు ఈ రోగం మిస్టరీ వీడలేదు. కేంద్రబృందం ఈ వ్యాధి ఎలా సోకిందనే విషయంపై ముమ్మర పరిశోధన సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కేరళ రాష్ట్రంలో వైద్యసిబ్బంది ఓ కొత్తరోగాన్ని గుర్తించారు. సౌత్ ఆఫ్రికానుంచి ఈ వింతవ్యాధి కేరళకు వచ్చినట్టు సమాచారం.
కరోనా కూడా మొదట కేరళలోనే వెలుగుచూసింది. నిఫా వైరస్కూడా అక్కడ తాజాగా కేరళలోని ఓ వ్యక్తి శరీరంలో వైద్యులు ప్లాస్మోడియం ఓవెల్ అనే పారాసైట్ (పరాన్నజీవి) అవశేషాలు గుర్తించారట. ఈ పరన్నాజీవి దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చినట్టు సమాచారం. ఈ పరాన్నజీవి మన శరీరంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది. ఇది ప్రాణంతకమా కాదా అన్న విషయాలపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వ్యాధి పెద్దగా ప్రాణాంతకం కాకపోవచ్చని ఆమె చెప్పారు.
లక్షణాలు ఎలా ఏమిటి?
ఈ పరాన్నజీవి కనక మనశరీరంలోకి ప్రవేశిస్తే తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తీవ్రమైన చెమట, దగ్గు, కడుపు నొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరాన్నజీవి దోమల ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరాన్నజీవి మలేరియాను కలిగిస్తుంది. ఇప్పటికే మలేరియా ఆడ ఎనఫిలస్ దోమల వల్ల వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్లాస్మోడియం ఓవెల్ అనే పరాన్నజీవి వల్ల మనిషికి మలేరియా సోకే అవకాశం ఉన్నదట.
ప్లాస్మోడియం ఓవెల్ అంటే ఏమిటో
ప్లాస్మోడియం ఓవెల్ అనేది బ్యాక్టిరియా కంటే కఠినమైన నిర్మాణం ఉన్న ఓ ఏకకణ జీవి. ఇది ప్రొటోజోవా వర్గానికి చెందిన పరాన్నజీవి ఇది మనశరీరంలోకి వస్తే వెంటనే మలేరియా వస్తుంది. అయితే ఈ పరన్నాజీవి మనిషి శరీరంలోకి సోకినా అంత ప్రాణాంతకం కాదని వైద్యులు సూచిస్తున్నారు. అయినప్పటికీ ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తులను మెరుగైన వైద్యం చేయాలని వాళ్లు సూచిస్తున్నారు.