‘గంట’ కాదు ‘నెల’ తర్వాత వాట్సాప్ లో డిలీట్ చేసేయొచ్చు

Update: 2021-11-05 03:49 GMT
జీవితం లో భాగం గా మారి పోయింది వాట్సాప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మెసేజింగ్ యాప్ కానీ హటాత్తుగా పని చేయటం కానీ ఆగిపోతే ఏమవుతుందన్న సందేహానికి సైతం భయం పుట్టే పరిస్థితి. ఎందుకంటే.. అంతలా కనెక్టు అయిపోయిన పరిస్థితి. వాట్సాప్ లాంటి ఫీచర్లు ఉన్నవి మరికొన్ని ఉన్నప్పటికి.. వాటిని యూజ్ చేసేందుకు పెద్ద గా ఆసక్తి వ్యక్తం కాని పరిస్థితి. అంతేకాదు.. వాట్సాప్ కు సంబంధించిన ఫలానా విషయంలో లోటు ఉందన్న భావన కలగకుండా.. ఎప్పటికప్పుడు.. మారుతున్న అవసరాల కు తగ్గట్లుగా మార్పులు చేయటం.. దాన్ని మరింత ఎక్కువ గా వాడుకునేలా చేయటం లో వాట్సాప్ సక్సెస్ అవుతుందని చెప్పాలి.

తాజాగా తీసుకొచ్చిన ఫీచర్ ఇందుకు నిదర్శనం. కానీ.. కొత్తగా తీసుకొచ్చే ఫీచర్ గురించి తెలిస్తే నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితి. కొందరి వెసులుబాటు కోసం తెస్తున్న ఈ ఫీచర్ వల్ల లాభాలు ఎంతో.. నష్టాలు కూడా అంతే అన్న విషయం అర్థం కాక మానదు. వాట్సాప్ లో ఏమైనా మెసేజ్ చేసినా.. ఫోటో కానీ వీడియో కానీ.. ఆడియో క్లిప్ కానీ ఇలా ఏం పంపినా.. గంటలోపు.. ‘‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’’ అనే ఫీచర్ తో పంపిన వాటిని డిలీట్ చేసే వెసులుబాటు ఉంది. గతంలో గ్రూపు మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం లేకున్నా.. వ్యక్తిగతంగా ఎవరికైనా మెసేజ్ పంపితే డిలీట్ చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని నాలుగేళ్ల క్రితం పరిచయం చేశారు.

అయితే అప్పట్లో డిలీట్ చేయటానికి టైం లిమిట్ 7 నిమిషాలుగా ఉండేది. ఆ తర్వాత మూడు దఫాల్లో మూడు టైమ్ లిమిట్ ను తీసుకొచ్చారు. ఎవరికైనా మెసేజ్ (అదే రూపంలో ఉన్నా సరే) పంపి.. అందులో తప్పులు ఉన్నా.. పంపించటం అనవసరం అనుకున్నా.. అరే.. పొరపాటున పంపామని భావించినా.. వెంటనే డిలీట్ చేసే వీలుంది. ఇప్పుడీ వెసులుబాటును గంట కాకుండా ఏకండా నెల తర్వాత కూడా డిలీట్ చేసేందుకు అవకాశాన్ని ఇస్తోంది. దీని వల్ల లాభం ఎంతన్నది చెప్పలేకున్నా.. నష్టం మాత్రం ఎక్కువే అన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. ఎవరైనా ఏదైనా డాక్యుమెంట్ ను కానీ.. ఇంకేదైనా కానీ పంపిన తర్వాత దాన్ని.. డిలీట్ చేయటానికి నెల రోజులు వ్యవధి ఉండటంతో.. ఎవరు ఎప్పుడు దేనినైనా డిలీట్ చేసే వీలు ఉంటుంది. దీంతో.. పంపిన మెసేజ్ లు ఎప్పుడైనా అవసరానికి చెక్ చేయాలన్నా.. ఇతర అవసరాలకు వాడాలని భావించినప్పుడు అవి లేకపోవటం ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పాలి. కొన్ని సందర్భాల్లో మొదట సమాచారాన్ని పంపినా.. తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా.. హటాత్తుగా డిలీట్ చేసేందుకు నెల రోజులు సమయం ఉండటంతో.. ఎవరైనా ఏమైనా చేసే వీలుంటుంది. తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంతో కొన్ని తిప్పలు ఎదురవుతాయన్న మాట వినిపిస్తోంది.



Tags:    

Similar News