ఈ ప్రపంచంలో చాలా మందికి లాజిక్కులు అవసరం లేదు.. అందరికీ మ్యాజిక్కులే కావాలన్న త్రివిక్రమ్ మాటలు ఎవర్ గ్రీన్. చిటికేస్తే.. కాసుల వర్షం కురవాలి. ‘ఓం బీం జార్జ్ డబ్ల్యూ బుష్..’ అనగానే లేని డబ్బు ప్రత్యక్షమవ్వాలి.. ఉన్నవి రెంతలు కావాలి. ఫైనల్ గా కష్టపడకుండా బంగారు కొండలు సంతమవ్వాలి.. బ్యాంకు లాకర్లు ఇంట్లో ప్రత్యక్షమవ్వాలి.
ఇలాంటి గొర్రెల కోసమే ఏపీలో వెతికాడో మంత్రగాడు. కృష్ణా జిల్లా లోని పెనమలూరు చెరువు కట్టపై పూలు అమ్ముతున్న మహిళను టార్గెట్ చేశాడు. ఆమె వద్దకు వెళ్లి తన పేరు హరి అని పరిచయం చేసుకున్నాడు.
తరచూ వెళ్లి పలకరించడం వంటివి చేస్తూ ఉండేవాడు. మంత్రగాడు ఎంత తీయగా మాట్లాడుతాడో తెలిసిందే కదా. ఎవ్వరైనా ఐస్ అవ్వాల్సిందే. ఆ పూలు అమ్మే మహిళ కూడా కరిగిపోయింది. హరి ఎంత మంచివాడో అనుకుంది.
తన దారిలోకి వచ్చినట్టే అనుకున్న తర్వాత ఆపరేషన్ మొదలు పెట్టాడు హరి అనబడే దొంగ. తనకు మాయలు, మంత్రాలు వస్తాయని చెప్పాడు. తన మంత్రాలతో చింతకాయలే కాదు.. తాటికాయలు కూడా రాలుతాయి తెలుసా? అన్నాడు. దానికి.. కళ్లు పెద్దవి చేసిన సదరు మహిళ అవునా? అన్నది.
ఇంకేం చేయగలవు అని అడిగితే.. బంగారాన్ని రెండింతలు చేయగలను.. డబ్బు కట్టలను ఐదుకు పది చేయగలను అన్నాడు. తాను మంత్రగాడిని కాబట్టి.. ఇదంతా తనకు మామూలు విషయం అన్నాడు. అయితే.. తన బంగారం కూడా రెట్టింపు చేస్తావా అన్నది. చేస్తాలేగానీ.. ఈ సీక్రెట్ ఇంకెవ్వరికీ చెప్పొద్దు మరి, అన్నాడు హరి. అలాగే అన్నది సదరు మహిళ. ఆ తర్వాత.. మా చెల్లికి, కోడలికి కూడా ఛాన్స్ ఇయ్యవా ప్లీజ్? అని అడిగింది. కాస్త కష్టమేగానీ.. పర్వాలేదు పట్టుకురా అన్నాడు.
ఎంతో సంబరంగా ముగ్గురి బంగారం మొత్తం 30 కాసులు, 2 లక్షల రూపాయల డబ్బు అతగాడి చేతిలో పెట్టారు. అతను వాటిని ఓ కుండలో పెట్టి, ఓ గంటపాటు పూజచేసి, భూమిలో పాతిపెట్టాడు. 21 రోజుల తర్వాత తీసి చూస్తే.. రెట్టింపు అవుతాయని చెప్పాడు. గడువు ముగిసిన తర్వాత వస్తాను.. నాకు ఇవ్వాల్సిన సంభవాన కూడా అప్పుడే ఇవ్వండి అని చెప్పి వెళ్లిపోయాడు హరి. వీళ్లు మాత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.. కంప్లైట్ ఇవ్వడానికి!