ప్రస్తుతం వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. వేలకు వేల కేసులు పెరుగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఆ మహమ్మారి వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జాగ్రత్తగా తమ కార్యకలాపాలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడ వైరస్ సోకుతుందేమోననే ఆందోళనతో అత్యవసర పనులు.. ముఖ్యమైతేనే బయటకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆస్పత్రులన్ని వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సమయంలో ఇతర అనారోగ్యానికి గురైన వారికి వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. ఆస్పత్రులు వైరస్ వ్యాప్తికి కేంద్రాలుగా మారిన నేపథ్‌యంలో గుజరాత్ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. అనారోగ్యానికి గురైన వారికి ఇంటికే వచ్చి వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ఓ కొత్త కార్యక్రమం ప్రారంభించింది.
ఆ కార్యక్రమం ప్రధానమంత్రి ప్రశంసలు పొందింది. ఇంతకు ఏం చేశారంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ మునిసిపల్ యంత్రాంగం వినూత్న ఆలోచన చేసింది. వైరస్ సోకని వారు అనారోగ్యానికి గురైన ప్రజలకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలందించేందుకు ‘ధన్వంతరి రథా’ల పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అనారోగ్యానికి గురైన ప్రజలకు వైద్యం అందించేందుకు ఈ వాహనాలను వినియోగిస్తున్నారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి వచ్చింది. ఆ వాహనాల ఏర్పాటును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
వైరస్ కట్టడి-రాష్ట్రాల సన్నద్ధతపై శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అహ్మదాబాద్ ‘ధన్వంతరి రథాల’ పనితీరును ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ కార్యక్రమాన్ని మిగతా రాఫ్ట్రాలు అమలు చేయాలని సూచించారు.