కొత్త పార్లమెంట్ కు సై.. బరిలో 3 కంపెనీలు

Update: 2020-08-13 11:30 GMT
85 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో కట్టారు మన భారత పార్లమెంట్ భవనం. ఇప్పటికీ ఇది మన లోక్ సభ, రాజ్యసభకు వేదికగా ఉంది. అయితే ఈ బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. దాంతోపాటు ఇందులో ఫైర్ సేఫ్టీ సహా మౌలిక సదుపాయాలు లేవు. రక్షణ పరంగా కూడా ఆమోదయోగ్యంగా లేదు.

ప్రస్తుత పార్లమెంట్ భవనం.. ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. దీంతో దీన్ని చెక్కు చెదరకుండా భావితరాలకు అందించాలి. అందుకే మోడీ సర్కార్.. అవసరాలకు సరిపోని ప్రస్తుత పార్లమెంట్ స్థానంలో కొత్త  పార్లమెంట్ భవనం నిర్మించాలని యోచిస్తున్నారు.

ఇప్పటికే యూపీఏ2 హయాంలోనే నాటి ప్రభుత్వం ఓ కమిటీని కొత్త పార్లమెంట్ కోసం వేసింది. ఇక రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గత ఏడాది ఆగస్టు 5న కొత్త భవనం నిర్మించాలని ప్రధాని మోడీకి ప్రతిపాదించారు.  అయితే కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.

భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు (వజ్రోత్సవాలు) 2022 ఆగస్టు 15న జరగబోతున్నాయి. ఆ సమయానికి కొత్త పార్లమెంట్ భవనంలోనే ఉభయ సభల సమావేశాలు జరిగేలా కొత్త భవనం నిర్మించాలని మోడీ సర్కార్ ప్లాన్ చేసింది.

ఈ క్రమంలోనే కొత్త భవన నిర్మాణ పనులకు  కేంద్రం దేశ నిర్మాణరంగంలోని దిగ్గజ కంపెనీలను ఆహ్వానించగా మొత్తం ఏడు సంస్థలు పోటీపడ్డాయి. కేంద్రం షార్ట్ లిస్ట్ తీయగా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఎల్ అండ్ టీ, టాటా ప్రాజెక్ట్స్, షపూర్ జీ, పల్లాంజీ కంపెనీలు తుదిదశ బిడ్డింగ్ కు అర్హత సాధించాయి. ఈ మూడు కంపెనీలు ఫైనాన్షియల్ బిడ్స్ ను సమర్పించనున్నాయి.
Tags:    

Similar News