సచివాలయ పోస్టుల్లో భారీ ట్విస్ట్

Update: 2019-10-25 09:41 GMT
ఏపీలో సీఎం జగన్ ఎంతో ఉన్నతాశయంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని అమలు చేసిన ‘గ్రామ, వార్డు సచివాలయ’ ఉద్యోగ నియామకాల్లో గందరగోళం నెలకొంది. అధికారులు చేసిన తప్పుకు నిరుద్యోగులు బలైపోతున్నారు.

తాజాగా నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల్లో అభ్యర్థులు పరీక్షలన్నీ రాశారు. ఇందులో చాలా మందికి రెండు మూడు శాఖల్లో ఉద్యోగాలు వచ్చాయి. అయితే అభ్యర్థి ఏదో ఒక మెరుగైన పోస్టులో చేరిపోయాడు. ఆ పోస్టును అధికారులు గుర్తించి.. అతడు సెలెక్ట్ అయిన మరో రెండు పోస్టులను అతడి తర్వాత మెరిట్ ఉన్న నిరుద్యోగులకు కేటాయించాలి. కానీ అధికారులు ఇక్కడే గుర్తించక పోస్టులో చేరిన వారికే తిరిగి కౌన్సిలింగ్ కు రావాలని కాల్ లెటర్లు పంపారు. దీంతో అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కడం లేదు. ఆ పోస్టులు భర్తీ కానీ పరిస్థితి నెలకొంది.

  జిల్లాల్లో రెండో విడత నియామకాలకు కౌన్సిలింగ్ మొదలైనప్పటికీ సగం మంది నిరుద్యోగులు కూడా దీనికి హాజరు కాలేదు. ఇప్పటికే జిల్లాల్లో పోస్టింగ్ పొందిన అభ్యర్థులు తాము ఉద్యోగాల్లో చేరామని అధికారులకు సమాచారం ఇవ్వలేదు. దీంతో అధికారులు పోస్టుల్లో చేరిన వారికే తిరిగి కాల్ లెటర్లు పంపినట్టు తెలిసింది. దీంతో రెండో కౌన్సిలింగ్ కు నిరుద్యోగులు రాని పరిస్థితి నెలకొంది.

ఇక అధికారులు  రిజర్వేషన్ కోటాలోనే ఓపెన్ కేటాయిరీ వారిని పోస్టింగ్ ఇవ్వడంతో అసలైన రిజర్వేషన్ కలిగిన వారికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలో పదుల సంఖ్యలో స్పోర్ట్స్ కోటా సీట్లు ఉంటే.. ఏకంగా వందల మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించడం గందరగోళానికి దారితీసింది. ఇక ఎంపీఈవో పోస్టుల్లో దరఖాస్తులు అప్ లోడ్ చేసిన అగ్రికల్చర్ పోస్టు అభ్యర్థులు వెయిటేజ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో 165 మంది దాకా ఉద్యోగాలు పొందని పరిస్థితి నెలకొంది. ఇక ఇక్కడ ఫెయిల్ అయిన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వడంతో అసలైన వారు నష్టపోతున్నారు. 165 మంది ఉన్నతాధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది.
Tags:    

Similar News