దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంద్ సౌర్ పైశాచిక అత్యాచార ఉదంతంలో మరో కోణం బయటకు వచ్చింది. ఈ దారుణం ఒక్కడే కాదని గ్యాంగ్ రేప్ అన్న కొత్త విషయంతో పాటు.. ఇదంతా ప్లాన్ ప్రకారమే చోటు చేసుకుంది తప్పించి మరొకటి కాదన్న విషయాన్ని నిందితుడు విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ నిర్భయ ఉదంతాన్ని తలపించే రీతిలో.. వినేందుకే వణికిపోయేలా చేసిన ఈ దుర్మార్గం అంతా పథకం ప్రకారమే చోటు చేసుకున్నదే తప్పించి అప్పటికప్పుడు జరిగింది కాదన్న విషయం వెల్లడైంది. పోలీసుల విచారణలో నిందితుడు ఇర్ఫాన్ జరిగిన ఉదంతాన్ని చెప్పుకొచ్చాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ బయట ఉన్న వేళ.. ఆ పాపకు స్వీట్లు కొనిపిస్తానన్న ఆశ చూపి తనతో తీసుకెళ్లినట్లుగా చెప్పాడు.
స్కూల్ ముందు నుంచి తాను వెళుతున్నప్పుడు బాలిక ఒక్కతే ఉందని.. పది నిమిషాల తర్వాత వచ్చినా ఆమె అక్కడే ఉందని.. చుట్టుపక్కల ఎవరూ లేరని.. దీంతో స్వీట్లు కొనిపిస్తానని చెప్పి తనతో తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఒకవేళ.. ఎవరైనా అడ్డగిస్తే.. ఆమెను తీసుకెళ్లటానికి ఎవరూ రాలేదని.. తాను తోడుగా తీసుకెళుతున్నట్లుగా చెప్పించి నమ్మించాలన్న ప్లాన్ వేసుకున్నట్లు చెప్పాడు.
స్కూల్ వెనుకాల ఉన్న పాడుబడిన లక్ష్మీదర్వాజ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి తన స్నేహితుడికి ఫోన్ చేసి రప్పించినట్లు చెప్పాడు. దారుణంగా చిన్నారిని అత్యాచారం చేసి ఆపై ఆమె గొంతు కోసినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాధిత బాలిక మాత్రం తనపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా వ్యవహరించినట్లు చెప్పింది. నిందితుడు మాత్రం తాము ఇద్దరమే ఉన్నట్లు చెప్పటం గమనార్హం.