బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త వీసా నిబంధనలతో మన సాఫ్టువేర్ ఇంజినీర్ల ఆశలపై నీళ్లు చల్లింది. వీసా నిబంధనలను టైట్ చేయడంతో ఐరోపా సమాఖ్యకు చెందని దేశాల వృత్తి నిపుణులు బ్రిటన్ వెళ్లాలంటే ఇంతకుముందుకంటే కష్టం కానుంది. ఈ ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడనుంది.
టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ ఫర్ (ఐసీటీ) విభాగంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునేవాళ్లకు వేతనం రూ. 25 లక్షలు ఉండాలంటూ బ్రిటన్ తన వీసా నిబంధనలను సవరించింది. ఇంతకుముందు రూ. 17.30 లక్షలు వేతనం ఉంటే సరిపోయేది. ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్.. అంటే తాము సొంత దేశంలో పనిచేస్తున్న సంస్థ తరఫున విదేశాల్లో పనిచేయడానికి వెళ్లడం. ఇండియన్ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఈ విధానం పాటిస్తాయి. విదేశాల్లో ఉన్న తమ బ్రాంచులకు మనవాళ్లనే పంపిస్తాయి.
వేతన పరిమితిని కేవలం టైర్ 2 ఐసీటీ విభాగానికే కాక ఇతర విభాగాలలో కూడా పెంచారు. టైర్ 2 (సాధారణ) ఉద్యోగులకు రూ. 20.80 లక్షల వేతనం ఉండాలని చెబుతూ - కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ట్రైనీలుగా వచ్చే టైర్ 2 (ఐసీటీ) గ్రాడ్యుయేట్ ట్రైనీల వేతన పరిమితి 19.14 లక్షలుగా నిర్ణయించారు. దాంతోపాటు ఒక్కో కంపెనీ ఏడాదికి కేవలం 20 మందిని మాత్రమే తేవాలని రూల్ పెట్టారు.
కాగా బ్రిటన్ ప్రధాని థెరెసా మే భారత్ రావడానికి ముందు తీసుకున్న ఈ నిర్ణయంపై మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరో మూడు రోజుల్లో రానున్న థెరెసాతో దీనిపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/