రోజువారీగా ఎన్నో అంశాలు జరిగిపోతుంటాయి. వీటిల్లో కొన్ని అంశాలపై అవగాహన తప్పనిసరి. అప్ డేట్ కావాల్సిందే. లేకపోతే.. వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అలాంటివి కొన్ని అంశాలు తాజాగా చోటుచేసుకున్నాయి. అవేంటో చూస్తే..
1. టోల్ ప్లాజాలు లేని రహదారులు ఉండాలన్న ప్రధాన డిమాండ్ తో లారీ యజమానులు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె బుధవారం అర్థరాత్రి నుంచి మొదలైంది. దీంతో.. దేశవ్యాప్తంగా ఉన్న లారీలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 లక్షల లారీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈ సమ్మె కానీ దీర్ఘ కాలం కొనసాగితే.. పాలు.. కూరగాయలు.. పండ్లు.. నిత్యవసర వస్తువుల మీద తీవ్ర ప్రభావం పడే వీలుంది. ధరల పెరగటం ఖాయం.
2. లారీల సమ్మెతో పలు పెట్రోల్ బంక్ లు మూత పడ్డాయి. దీంతో.. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద విపరీతమైన క్యూలు కనిపిస్తున్నాయి. సో.. మీ వ్యక్తిగత వాహనాల్లో పెట్రోల్ ఎంతుందో అర్జెంట్ గా చెక్ చేసుకోండి.
3. ఎన్నో ఏళ్లుగా వింటున్న ఒక ప్రకటన ఇక.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని రైల్వే స్టేషన్లలో వినిపించదు. సికింద్రాబాద్.. న్యూఢిల్లీల మధ్య నిత్యం నడిచే ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు మారిపోయింది. విభజనలో భాగంగా ఈ రైలు పేరును తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మార్చేశారు. ఈ రోజు (గురువారం) నుంచి ఇకపై.. తెలంగాణ ఎక్స్ ప్రెస్ పేరు మాత్రమే వినపడనుంది.
4. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి డీజిల్.. పెట్రోల్ ధరలను సమీక్షించటం తెలిసిందే. అంతర్జాతీయ పరిస్థితులకు తగ్గట్లుగా ధరల్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంటారు. బుధవారం ముగిసిన సెప్టెంబరు నెలాఖరున సమావేశమైన పెట్రోలియం శాఖాధికారులు పెట్రోల్ మీద ధరను మార్చలేదు. కాకపోతే.. డీజిల్ ధరను మాత్రం లీటరుకు 50 పైసలు చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెరిగిన ధర బుధవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ధరను పెంచకుండా నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.
5. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొత్త టైంటేబుల్ వచ్చింది. ప్రతి ఏడాది చేయాల్సిన మార్పులకు అనుగుణంగా కొత్త టైంటేబుల్ లో వీటిని అమలు చేస్తుంటారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొన్ని ట్రైన్ల టైం మారటంతో పాటు.. నెంబర్లు కూడా మారాయి. కొన్ని సర్వీసులకు సంబంధించి అవి నడిచే రోజుల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి.
6. రైళ్లు నడిచే రోజుల్లో మార్పులు చూస్తే.. పద్మావతి ఎక్స్ ప్రెస్ (సికింద్రాబాద్ నుంచి బయలుదేరేది) గతంలో మాదిరి శనివారం సర్వీసు ఉండదు. కొత్తగా అమల్లోకి వచ్చిన టైంటేబుల్ ప్రకారం మంగళవారం సర్వీసు ఉంటుంది. అదే విధంగా డౌన్ పద్మావతి (తిరుపతి నుంచి బయలుదేరేది) గతంలో ఉన్న ఆదివారం సర్వీసు ఉండదు. ఇందుకు బదులుగా శుక్రవారం సర్వీసు ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి (వయా పాకాల)కు వెళ్లే సర్వీసులో మంగళవారం క్యాన్సిల్ చేసి.. శనివారం ప్రారంభించారు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి వచ్చే ట్రైన్ లో బుధవారం సర్వీసును క్యాన్సిల్ చేశారు. దీనికి బదులుగా ఆదివారం సర్వీసు నడపనున్నారు. అదే విధంగా పది రైల్ సర్వీసుల నెంబర్లు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.