కరోనా గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తుంది. ప్రాణాంతక కరోనా వైరస్ ఊపిరి వదిలినప్పుడు ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని, గాల్లోనే నాలుగు గంటలపాటు ఉండగలదని అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధన తెలిపింది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరం ఎంతవరకూ పనిచేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ విషయాలను తెలిపారు. దగ్గు, తుమ్ము వంటి వాటివల్ల గాల్లో ఏర్పడే మేఘాల్లాంటి నిర్మాణాలపై 1930లలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరాన్ని ప్రతిపాదించిందని, కానీ ఈ అంచనాలు ఇప్పుడు పనికిరావని అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా హెచ్చరించారు అన్ని రకాల నీటి తుంపర్లు వైరస్ ను కలుపుకుని 23 నుంచి 27 అడుగుల దూరం ప్రయాణించగలవని తెలిపారు. తుంపర బిందువు పరిమాణంపై ఏకపక్షంగా నిర్ణయాలు జరిగాయని - వాటి ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేశారని ఆరోపించారు.
ఇకపోతే , ప్రపంచ వ్యాప్తంగా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. 12 గంటల్లో దేశంలో 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన చేసింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2032కి చేరిందని చెప్పింది. ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 936,670 మందికి కరోనా సోకగా ... 47,259 మంది మృతి చెందారు.