కాలం ఎంత చిత్రమైనదో..? కొవిడ్ కూడా అంతే విచిత్రమైనది.. అందుకే అది మహమ్మారిగా మారింది. ఎటునుంచి వ్యాపిస్తుందో.. ఎలా అంటుకుంటుందో తెలియని పరిస్థితి. టీకా వచ్చినా ప్రమాదం తొలగలేదంటేనే కొవిడ్ తీవ్రత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే, పెద్ద దేశాలే కరోనా దెబ్బకు తట్టుకోలేకపోయాయి. అంతెందుకు అమెరికాలో ఈ వైరస్ తో పది లక్షల మంది చనిపోయారు.
బ్రెజిల్ లాంటి చోట్ల అయితే మరణాలకు లెక్కేలేదు. అక్కడి అధ్యక్షుడు బోల్సోనారో కొవిడ్ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్నా లాక్ డౌన్ విధించకుండా మొరాయించారు. ఇక చైనా అయితే తొలినాళ్లలోనే కొవిడ్ ను కట్టడి చేసింది.
వైరస్ జన్మ స్థానంగా భావిస్తున్న వూహాన్ లో లాక్ డౌన్ విధించి మిగతా దేశానికి పాకకుండా చూసుకుంది. కాకపోతే.. వూహాన్ స్ట్రెయిన్ నుంచి మర్చిపోయిన సమయంలో ఒమైక్రాన్ రూపం విరుచుకుపడి చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో షాంఘైలో నెలపైగా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధాని బీజింగ్ లోనూ పాక్షిక ఆంక్షలు తప్పలేదు.
ఉత్తర కొరియాది మరో కథ
నియంత పాలనలోని ఉత్తర కొరియాది మరో రకం కథ. సరిహద్దుల నుంచి రాకపోకలు సాగించేవారితో వైరస్ వ్యాపించకుండా కందకాలు తవ్వించిన చరిత్ర నియంత కిమ్ ది. కానీ, ఇప్పుడు ఆ దేశం కూడా కొవిడ్ తో సతమతం అవుతోంది. కిమ్ సైతం ఎన్నడూ లేనివిధంగా మాస్క్ల్ ధరించి కనిపిస్తున్నాడు. అసలే ఆర్లిక సంక్షోభంలో, వైద్య వసతులు అధ్వానంగా ఉండే ఉత్తర కొరియాలో రెండు రోజుల్లోనే 8 లక్షల కేసులు వచ్చాయి. వైరస్ ఇలానే వ్యాపిస్తే ఉత్తర కొరియా ఖేల్ ఖతం అనే మాట వినిస్తోంది.
న్యూజిలాండ్ ది భిన్నమైన రీతి
ద్వీప దేశం న్యూజిలాండ్ కొవిడ్ పట్ల మొదటినుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అనేక చర్యలు తీసుకుంది. పర్యాటకంగా పేరుగాంచినప్పటికీ రెండేళ్లు టూరిస్టులనే అనుమతించలేదు. కొవిడ్ కట్టడిలో ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డ్రెన్ ది కీలక పాత్ర.
ఒక విధంగా 2020 మార్చి ప్రారంభంలోనే లాక్ డౌన్ విధించి ప్రపంచానికే న్యూజిలాండ్ ను ఆదర్శంగా నిలిపారామె. అయితే, ఆదివారం ఆర్డ్రెన్ కొవిడ్ బారినపడ్డారు. ఆమెకు భర్త నుంచి వైరస్ సోకింది. దీంతో జెసిండా వారం రోజులు ఐసొలేషన్ కు వెళ్లారు. కాగా, ఒమైక్రాన్ కారణంగా న్యూజిలాండ్ లో గత వారం 50 వేలపైగా కరోనా కేసులు వచ్చాయి.