ఏపీలో కరోనా కేసుల జోరు తగ్గడం లేదు. వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీరోజు 10వేలకు కేసులు తగ్గడం లేదు. శనివారం కూడా అదే జోరు కొనసాగింది.
తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 75465 టెస్టులు చేయగా దాదాపు 10వేల కేసులు వెలుగుచూశాయి. దీంతో ఏపీలో కరోనా కేసులు 5.50 లక్షలు దాటేశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 5,57,587 కు పెరిగాయి.
ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య కూడా ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య ఏకంగా 63 గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4846కు పెరిగింది.
కడప జిల్లాలో అత్యధికంగా 9మంది, చిత్తూరులో 8మంది, ప్రకాశంలో 8 చొప్పున మరణించారు.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ ఒక్క జిల్లాలోనే కేసులు 75వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారంతో తూ.గోదావరిలో అత్యధికంగా ఏకంగా 1398 కేసులు నమోదయ్యాయి.