మంత్రి బాలినేనిని బుజ్జ‌గించిన సీఎం.. ఎందుకంటే!

Update: 2022-04-05 09:30 GMT
జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క మంత్రి, యువ నాయ‌కుడు.. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో వైసీపీ త‌ర‌ఫున చ‌క్రం తిప్పుతున్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి భారీగా అలిగిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది.  సీఎం జ‌గ‌న్‌కు ఎంతో కావాల్సిన మ‌నిషిగా పేరుండ‌మేకాదు.. త‌న శాఖ విష‌యంపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఎప్పటిక‌ప్పుడు స్పందిస్తూ, ప‌రిష్క‌రిస్తూ ఉంటారు. అయితే.. ఇప్పుడు బాలినేని నిమిత్త మాత్రుడిని అయిపోయానంటూ.. ఆయ‌న వ‌గ‌రుస్తున్నార‌ట‌! అంతేకాదు..  రెండువారాలుగా తాడేప‌ల్లి స‌హా నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న‌ క‌నిపించ‌డం లేదు.  

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా.. ఒంగోలు నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కిన బాలినేని జ‌గ‌న్ తొలి కేబినెట్‌లో విద్యుత్, అట‌వీ శాఖ‌ల మంత్రిగా ప‌నిచేస్తున్నారు.  అయితే.. ఇటీవ‌ల జ‌రిగిన ఒక ప‌రిణామంతో ఆయ‌న జ‌గ‌న్‌పై అలిగి.. జిల్లాను వ‌దిలేసి.. హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. దీనికి కార‌ణం ఏంటంటే.. త్వ‌ర‌లోనే జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గాన్ని మారుస్తున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రినీ తీసేసి.. కొత్త‌వారిని నియ‌మిస్తామ‌ని.. అన్నారు. దీనికి మొద‌ట్లో బాలినేని కూడా త‌న స‌మ‌ర్ధ‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌నే స్వ‌యంగా ఈ విష‌యాన్ని కొన్నాళ్ల కింద‌ట మీడియాకు చెప్పారు.

అంతా సీఎం జ‌గ‌న్ ఇష్టం. ఆయ‌న ఏం చెప్పినా.. చేసేందుకు మంత్రులుగా.. మేం సిద్ధం. ఈ విష‌యంలో రెండో మాట‌కు ఛాన్స్ లేదని స్వ‌యంగా బాలినేని ప్ర‌క‌టించారు. అయితే.. ఇటీవ‌ల‌కాలంలో సీఎం జ‌గ‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయిన బాలినేని.. ఒక్క‌సారిగా హ‌ర్ట‌యి.. వెంట‌నే హైద‌రాబాద్‌లో సెటిల్ అయిపోయార‌ట‌. ఎందుకంటే... ప్ర‌కాశం జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న ఇద్ద‌రిలో.. బాలినేని, ఆదిమూల‌పు సురేష్ ల‌లో ఒక‌రిని కొన‌సాగిస్తాన‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పార‌ట‌. అంతేకాదు..  వ‌చ్చే మంత్రి వ‌ర్గంలో బాలినేనిని ప‌క్క‌న పెట్టి. సురేష్‌ను కొన‌సాగిస్తున్న‌ట్టు సీఎం స్వ‌యంగా బాలినేనికి చెప్పార‌ట‌.

దీంతో బాలినేనీ తీవ్రంగా హ‌ర్ట‌య్యారు. పార్టీలోనే అంద‌రిక‌న్నా ముందు నుంచి వ‌చ్చింది నేనే. ఉన్న‌ది నేనే. న‌న్ను కాద‌ని.. సురేష్‌కు ఎలా అవ‌కాశం ఇస్తారు? అనేది బాలినేని వాద‌న‌. అంతేకాదు.. జిల్లాలోను, రాష్ట్రంలోనూ పార్టీకి ఎలాంటి ఇబ్బంది వ‌చ్చినా.. చ‌క్క‌దిద్ బాధ్య‌త‌లు తీసుకుంటున్నాను. తీసేస్తే.. ఇద్ద‌రినీ తీసేయండి.. ఉంచితే.. ఇద్ద‌రినీ ఉంచండి! అనేది బాలినేని చెబుతున్న మాట‌. కానీ, సీఎం జ‌గ‌న్ మాత్రం ఇప్ప‌టికే బాలినేనిని ప‌క్క‌న పెట్టాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ట‌. ఈ విష‌యం తెలియ‌గానే.. బాలినేని ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోను.. ఉండ‌క‌.. అటు రాష్ట్రంలోనూ ఉండ‌క‌.. హైద‌రాబాద్‌లో ఉంటున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా ఒక‌టి రెండు రోజులు వ‌చ్చి.. త‌ర్వాత హైద‌రాబాద్‌కే వెళ్లిపోయారు. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై తాడేప‌ల్లి వ‌ర్గాలు ఆరాతీయ‌గా.. బాలినేని అనుచ‌రులు.. కీల‌క నాయ‌కులు.. కొంద‌రు ఆయ‌న‌ను స‌మ‌ర్ధించే ఎమ్మెల్యేలు.. విష‌యం వెల్ల‌డించారు. దీంతో మ‌ళ్లీ సీఎం జ‌గ‌న్‌.. స్వ‌యంగా ఆయ‌న‌ను పిలిచి మాట్లాడారు. మంత్రి ప‌ద‌వి నుంచి తీసేసినా.. కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ.. సురేష్‌ను మాత్రం కొన‌సాగిస్తాన‌ని చెప్పార‌ట‌. అయితే. బాలినేని దీనికి అంగీక‌రించ‌లేద‌ని.. ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌నమ‌ళ్లీ  హైద‌రాబాద్ వెళ్లిపోయార‌ని స‌మాచారం. మ‌రి జ‌న్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News