ప్రత్యర్థులు మోడీని దెబ్బేయలేని వేళలో.. సొంతోళ్లు నవ్వుల పాలు చేశారుగా?
నమ్మినప్పుడు మాత్రమే మోసం చేసే వీలుంది. ఎవరిని నమ్మన్నప్పుడు మోసపోయే అవకాశమే లేదు. ఇది అందరూ చెప్పేదే. కానీ.. ఇలాంటివి నిజ జీవితంలో అప్పుడప్పుడు తారస పడుతుంటాయి. తాజాగా చోటు చేసుకున్న ఒక పరిణామాన్ని చూసినప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని దెబ్బేయటానికి ప్రత్యర్థులు అవకాశం కోసం కాచుకొని కూర్చోవటం తెలిసిందే. అయినప్పటికీ వారికి దొరకని మోడీ.. తన వ్యక్తిగత సిబ్బంది దెబ్బకు దిమ్మ తిరిగిపోయిందన్న మాట వినిపిస్తోంది. ఎందుకిలా ఉంటే.. అలాంటి పరిస్థితి ఆయనకు ఎదురైందని చెప్పాలి.
ప్రధాని నరేంద్ర మోడీని చూసినప్పుడు ఆయన్ను ఏదో ఒక పాయింట్ లో దెబ్బేయటానికి ఆయన ప్రత్యర్థులంతా పనులు ఆపుకొని మరీ కాచుక్కొని కూర్చుని ఉంటుంది. అలాంటిది ప్రధాని ఒక సున్నితమైన అంశం విషయంలో తప్పులు చేస్తే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లుగా చెబుతున్నారు.
బుధవారం బాబు జగ్జీవన్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆయన్ను స్మరించకున్నారు. జగ్జీవన్ రామ్ ఫోటోకు భక్తి ప్రబుద్ధులతోపలమాల వేసి.. వంగి మరీ దండం పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను ఆయన సోషల్ మీడియా వింగ్ కాస్తంత అత్యుత్సాహంతో వెనుకా ముందు చూసుకోకుండా చేసిన పనికి.. అంతపెద్ద మోడీని చిన్నోడిగా మారాల్సి వచ్చింది.
విమర్శలకు గురి కావాల్సి వచ్చింది. ఇంతకీ మోడీపరివార్ మిస్ అయిన పాయింట్ ఏమంటే.. బాబూ జగ్జీవన్ రావుకు మోడీ మాష్టారు వంగి దండం పెట్టే ఫోటోలో.. నమో వెనుక స్వర్గీయ అరుణ్ జైట్లీతో పాటు.. మరింత మంది ఉండటం చూస్తే.. మోడీ పరివార్ చేసిన పనిని ఇట్టే అర్థమవుతుంది.
ఆ మధ్యన మరణించిన అరుణ్ జైట్లీ.. రామ్నాయక్ లతో పాటు మోడీ కలిసిరావటం.. చనిపోయిన వైనాన్ని మర్చిపోయి.. టైమ్లీగా ఉంటుందని పాత ఫోటోను కొత్తగా తీసినట్లుగా బిల్డప్ ఇచ్చి దేశ ప్రజలందరిని ఫూల్ చేయటమే కాదు.. అప్పటివరకు ఒక రేంజ్ లో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు నవ్వుల పాలు అయ్యేలా చేసిందని చెప్పక తప్పదు. మోడీని ప్రత్యర్థులు దెబ్బేయలేకపోయినా.. సొంతోళ్లు భలేగా దెబ్బేశారు కదా?