బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గవర్నర్ తమిళిసైతో టీఆర్ఎస్ ఫైట్ పతాకస్థాయికి చేరింది. ఇప్పటికే తమిళిసై ఢిల్లీ వెళ్లి టీఆర్ఎస్ పెద్దలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గులాబీ నేతలు గట్టి కౌంటర్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే శనివారం ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.
శనివారం ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్.. ‘దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదు. భాషా దురాభిమానం, ఆధిపత్యం బూమరాంగ్ అవుతోంది. ఏం తినాలో.. ఏం వేసుకోవాలో.. ఎవరిని ప్రార్థించాలో మీరే చెబుతారా? రాష్ట్రాల సమాఖ్య నిజమైన వసుధైక కుటుంబం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
నేను మొదట భారతీయుడిని.. ఆ తర్వాతే గర్వించదగ్గ తెలుగువాడిని.. తెలుగు వ్యక్తిని.. నా మాతృభాష తెలుగు. ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలను. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం.. ఇంగ్లీష్ భాషను నిషేధించడం వంటివి యువతకు తీవ్ర నష్టం కలిగిస్తాయి’ అని పేర్కొన్నారు.
అంతకుముందు అమిత్ షా మాట్లాడారు.. ‘వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకొనేప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లోనే కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని పిలుపునివ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇది భారతదేశంలో భిన్నత్వంపై దాడి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ చేసింది. ఇక్కడ వరుస సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కూడా ధీటుగా బదులిస్తోంది. గవర్నర్ నుంచి బీజేపీ నేతల వరకూ కడిగేసే ప్లాన్లు చేస్తోంది.