వైసీపీని ఇప్పుడు రిపేర్ చేయ‌లేము.. పీకే టీం!

Update: 2022-03-22 11:30 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీని ఇప్పుడు రిపేర్ చేయ‌లేము.. అని  రాజ‌కీయ వ్యూహ‌ క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌ బృందం  తేల్చి చెప్పిందా? అంటే... ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ మీద సెంటిమెంట్ ఉన్నా.. జ‌గ‌న్ మీద సానుభూతి ఉన్నా.. వైసీపీ అధికారంలోకి రాలేదు. నిజానికి 2012 ఉప ఎన్నిక‌ల్లో గెలిచింది. కానీ, రియ‌ల్‌ గా మాత్రం క్షేత్ర‌స్థాయిలో వైసీపీకి పోల్ బూత్ మేనేజ్‌మెంట్ లేదు. ఇది గ్ర‌హించిన టీడీపీ 2014 ఎన్నిక‌ల్లో బూత్ మేనేజ్ మెంట్ ఎలా చేయాలో.. అలా చేసి.. గెలిచింది.

త‌ర్వాత‌.. వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ కావ‌డం.. వాళ్ల‌కు మంత్రి ప‌దువులు ఇవ్వ‌డం.. తెలిసిందే. అయితే.. ఇదే త‌ర్వాత‌.. టీడీపీ పై వ్య‌తిరేక‌త వ‌చ్చేలా చేసింది. ఇక‌, వైసీపీలో కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చారు. వారు కొంత బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అదేవిధంగా డ‌బ్బులు కూడా ఖ‌ర్చు పెట్టుకున్నారు.. ఆ త‌ర్వాత‌.. పీకే టీం రంగంలోకి దిగింది. ఈ క్ర‌మం లో పీకే టీం ఇచ్చిన రిపోర్టు ఏంటంటే.. పార్టీ మీద అభిమానం ఉందికానీ, బూత్ స్థాయిలో మేనేజ్‌మెంట్ లేదని తేల్చారు. అయిన‌ప్ప‌టికీ.. యువ‌త‌ కు టికెట్ లు ఇవ్వ‌డం.. కొత్త‌వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం వంటివి క‌లిసి వ‌చ్చింద‌ని గుర్తించారు.

అంతేకాదు.. జ‌గ‌న్ మాట మీద నిల‌బ‌డే నాయ‌కుడిగా ప్రొజెక్టు చేశారు. జ‌గ‌న్ కోసం యువ‌త నుంచి వృద్ధు ల వ‌ర‌కు కూడా ఒక్క‌సారి ఆయ‌న‌ను గెలిపించుకోవాల‌నే క‌సితో అంద‌రూ ప‌నిచేశారు.. అదేస‌మ‌యంలో సీటు ఇచ్చిన‌వారు.. ఇవ్వ‌ని వారు కూడా జ‌గ‌న్ కోసం ప‌నిచేశారు. ఇదే గ‌త 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి బాగా క‌లిసి వ‌చ్చింది. 151 స్థానాల‌తో విజ‌యం ద‌క్కించుకుని రికార్డు సృష్టించేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. అదే విధంగా ఓటు బ్యాంకు సాధించేందుకు కూడా అవ‌కాశం ల‌భించింది.

ఆ త‌ర్వాత‌... పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసి.. వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పిన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. పీకే కు దాదాపు 350 కోట్లు ఇచ్చిన‌ట్టు కొన్నాళ్లు వాద‌న న‌డిచింది. ఇక‌, జ‌గ‌న్ పార్టీకి 151 సీట్లు వ‌చ్చిన త‌ర్వాత‌.. పీకే టీం కు దేశ వ్యాప్తంగా మంచి గుడ్ విల్ కూడా ల‌భించింది. చాలా రాష్ట్రాల్లో గెలిచే పార్టీలను ఎంచుకుని.. ఆయ‌న వ్యూహాలు ఇస్తూ.. గెలిపించారు. అక్క‌డ పోలింగ్ బూత్ మేనేజ్‌మెంట్ ఉంది కాబ‌ట్టి.. ఆయా రాష్ట్రాల్లో వ్యూహాలు ఎలా ఉన్నా.. గెలుపు గుర్రం ఎక్కారు.

అయితే.. జ‌గ‌న్ గెలిచి ఇప్ప‌టికి మూడేళ్లు అవుతోంది. ఇంత వ‌ర‌కు ఎమ్మెల్యేల‌కు కానీ.. ఎంపీపీ - ఎంపీటీసీ - స‌ర్పంచుల‌కు కానీ.. ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక‌, పార్టీ ప‌రంగా ఇంకా చెప్పాలంటే.. ఆరోజు జ‌గ‌న్ కోసం క‌ష్ట‌ప‌డిన పోలింగ్ బూత్ వాళ్ల జాబితాల‌ను.. లోట‌స్ పాండ్‌లోనే చించేసి.. తాడేప‌ల్లికి వ‌చ్చారు. క‌నీసం పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారు ఎలా ఉన్నారు..?  వారి ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? అనే ఆలోచ‌న కూడా చేయ‌లేదు. కానీ, ఇప్పుడు.. మ‌ళ్లీ ఎన్నిక‌లు ముందుకు రావ‌డం.. మ‌రోవైపు.. అన్ని పార్టీలూ క‌లిసి పుట్ టిముంచుతాయ‌నే ఊహాగానాలు వెల్లు వెత్త‌డంతో.. మ‌ళ్లీ.. పార్టీ నాయ‌కులు కావాల్సి వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే  ఇప్పుడు.. మ‌ళ్లీ మీరే సైనికులు.. మీరే ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి. ప్ర‌తి ఇల్లూ తిర‌గాలి.. అంటూ.. చెబుతున్నారు. ఇక‌, మ‌రోవైపు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబందించి.. పీకే టీం... వైసీపీ త‌ర‌ఫున ప‌నిచేసేందుకు ముఖం చాటేసే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు. దీనికి కార‌ణం.. బూత్ స్థాయిలో క‌మిటీలు నియమించుకోక పోవ‌డ‌మే అంటున్నారు. ముందుగా బూత్ స్థాయిక‌మిటీలు ఏర్పాటు చేసుకుంటే.. అప్పుడు చూద్దాం.. అనేశార‌ట‌. అంటే.. బూత్ స్థాయిలో క‌మిటీలు లేకుండా.. తాము చేయ‌లేమ‌ని.. స్ప‌ష్టం చేసింది.

కానీ, వైసీపీ మాత్రం పీకే టీంపై మ‌రోసారి ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో పీకే టీంతో త‌ర‌చుగా.. ముఖ్య‌మంత్రి భేటీ అవుతున్నారు. అయినా కూడా..పీకే టీంలోని ఒక జోన‌ల్ ఇంచార్జ్‌మాత్రం.. క్షేత్ర‌స్థాయిలో బూత్‌క‌మిటీల‌ని బ‌లోపేతం చేసుకోవాల‌ని.. సూచించాడ‌ని.. అంటున్నారు. ప్ర‌స్తుతం ఇదే విష‌యం తాడేప‌ల్లి వ‌ర్గాల్లో పెద్దఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే..  గ‌తంలో ప‌నిచేసిన‌.. బూత్ క‌మిటీ ల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదు.. మ‌రిఇప్పుడు ఎవ‌రు వ‌స్తారు? క‌నీసం.. ప్రభుత్వం వ‌చ్చాక‌.. వారికి ఎలాంటి అవ‌కాశం కూడా ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఎలా మారుతుందో చూడాల‌ని అంటున్నారు సీనియ‌ర్లు.
Tags:    

Similar News