పదవొచ్చి ఏడాదిన్నర... సార్లకు కుర్చీలు కూడా లేవు

Update: 2022-07-31 02:30 GMT
రాష్ట్రంలో వివిధ వెనుక‌బ‌డిన కులాల‌ను ఆదుకుంటున్నామంటూ, వారి కోస‌మే కార్పొరేష‌న్లు అంటూ 2020, అక్టోబ‌ర్ 18న ఏపీ సర్కారు పాల‌క‌ మండ‌ళ్లను ప్ర‌క‌టించింది. మొత్తం 56 కులాల‌కు సంబంధించి కార్పొరేష‌న్లు ప్ర‌క‌టించారు. అయితే వీటికి ఇప్ప‌టిదాకా ఆఫీసులంటూ లేవు.

వీటితో పాటు ఉన్న‌త కులాలు అయిన 9 కులాల‌కు కూడా కార్పొరేష‌న్లు ప్ర‌క‌టించారు. వీటికి కూడా ఆఫీసులు వాటి వ్యవ‌హారాల‌న్న‌వి  ఇప్ప‌టిదాకా తేల‌లేదు. ఇప్పుడు డిసెంబ‌ర్ తో ప‌ద‌వీ కాలం పూర్త‌యిపోనుంది. ఓ లెక్క న చూసుకుంటే అక్టోబ‌ర్ తోనే పాల‌క‌మండ‌ళ్ల టెర్మ్ పూర్తి కానుంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రెండేళ్ల ప‌ద‌వీ కాలంలో కార్పొరేష‌న్లు ఏం చేశాయి?

ముఖ్యంగా శ్రీ‌కాకుళం జిల్లాకు సంబంధించి మూడు ముఖ్య‌మ‌యిన కార్పొరేష‌న్లకు సంబంధించి ఇక్క‌డివారికే అవ‌కాశం ఇచ్చారు. తూర్పు కాపు కార్పొరేష‌న్, క‌ళింగ కోమ‌టి కార్పొరేష‌న్,  క‌ళింగ కార్పొష‌న్. వీటికి చైర్మ‌న్లుగా వ‌రుస‌గా మామిడి శ్రీ‌కాంత్, అంధ‌వ‌ర‌పు సూరిబాబు, పేడాడ తిల‌క్ ను నియ‌మించి, సంబంధిత ఉత్వ‌ర్తులు జారీచేశారు. వీరితో పాటు పాల‌క మండ‌ల స‌భ్యులు  కూడా నియ‌మితులు అయ్యారు.

కానీ ఇంత‌కూ ఈ కార్పొరేష‌న్లు ఈ రెండేళ్ల కాలంలో చేసిందేంటి ? వాటికి ఉన్న నిధులెన్ని అంటే ఇప్ప‌టికీ ఎవ్వ‌రూ స్ప‌ష్ట‌మ‌యిన  స‌మాధాన‌మే చెప్ప‌లేక‌పోతున్నారు. అంటే రాజ‌కీయ నిరుద్యోగం త‌గ్గించేందుకే కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేశారా అన్న వివాదం కూడా అప్ప‌ట్లో న‌డిచింది.

తాజాగా కాపు నేస్తం పేరిట ప్ర‌భుత్వం ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లకు పైగా విడుద‌ల చేసింది.  ఇక్క‌డ కూడా అర్హులు ఎంద‌రు ? ఎవ‌రికి ల‌బ్ధి చేకూర‌నుంది ? అన్న వాటిపై స్ప‌ష్లతే లేదు. నిన్న‌టి వేళ ఇప్ప‌టిదాకా ప‌ద్నాలుగువంద‌ల కోట్ల రూపాయ‌లు కాపు నేస్తం కోసం ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు. ఈ డ‌బ్బు పంపిణీ కారణంగా ల‌బ్ధి ఎవ‌రికి.. ఇవి ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌ల రూపంలో చెప్పేందుకు  చాలా బాగుంటాయి కానీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఇవెంత మాత్రం ప్ర‌యోజ‌నం కలిగిస్తాయన్నది ప్రశ్నగానే ఉండిపోయింది.
Tags:    

Similar News