జనసేనానికి బలం ఉంది. అయితే ఆ బలం ఎంతో తెలియదు. తెలియాలీ అంటే ఆయన సొంతంగానే జనంలో తేల్చుకోవాలి. 2019 ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు వచ్చాయి కదా మళ్లీ పోటీ చేస్తే అదే రిజల్ట్ రిపీట్ అవుతుందేమో అన్న సందేహం కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి అయితే ఉండదు. ఎందుకంటే ఈ మూడున్నరేళ్లలో జనసేన గ్రాఫ్ చాలానే పెరిగింది. ఆ విషయం బయటకు తెలుస్తూనే ఉంది. దాని కోసం ప్రత్యేకంగా ఏ సర్వే అవసరం లేదు. ఆ బలాన్ని ఇంకా పైకి తీసుకుపోవాలంటే రిస్క్ చేయాలి. అదే సొంతంగా ఒంటరిగా పోటీ చేయడం.
అపుడే జనాలకు పవన్ నచ్చుతాడు. ఈ విషయం ఎంతో మంది చెప్పారు. విశ్లేషణలు ఉన్నాయి. అయినా పవన్ కళ్యాణ్ అయోమయ రాజకీయాలను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఏపీలో మూడవ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఆ మాటకు వస్తే ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే ప్రజలకు అంత ఆనందం. వారికి అలా మంచి ఆప్షన్ ఉంటుంది.
పొత్తులు అన్నవి రాజకీయ పార్టీలకు మేలు. ప్రజలకు ఒక విధంగా చేటు. ఎందుకంటే కలగూరగంపలా పులిహోరలా కలసిపోయి వచ్చే పార్టీలకు అధికారం దక్కుతుందేమో కానీ ఆ మేరకు ప్రజలకు ఆప్షన్లు తగ్గిపోతాయి. అందువల్ల ప్రజలు కచ్చితంగా కొత్త పార్టీలను కొత్త రాజకీయాలను ఎపుడూ కోరుకుంటారు. అందువల్ల వారి వైపు ఎపుడూ క్లియర్ గానే రూట్ ఉంది.
ఎన్టీయార్ కొత్తగా పార్టీ పెట్టి గెలిచారు. చంద్రబాబు నవ యువకుడిగా సీఎం అయితే ఆయనకు చాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ కష్టాన్ని చూసి కొత్తగా నడిపిస్తారని అందలం ఎక్కించారు. ఆయన కుమారుడు అయిన జగన్ పాలన ఎలా ఉందో చూద్దామని ఆయన్నీ సీఎం గా చేశారు. మరి ఇన్ని చేసిన వారు పవన్ని మాత్రం ఎందుకు దూరం పెడతారు. ఆయనకూ ఒక చాన్స్ ఇస్తారు. మరి ఆ చాన్స్ దొరకబుచ్చుకోవాలీ అంటే పవన్ కూడా తన వైపు నుంచి చాలానే చేయాలి కదా.
పైన చెప్పిన నాయకులు అంతా తామను తాము గట్టిగా రుజువు చేసుకున్నరు. దేనికైనా రెడీ అంటూ జబ్బలు చరచారు. పవన్ కూడా తన విధానం ఇదీ, తాను ఈ విధంగా ప్రజలకు న్యాయం చేస్తాను, తాను వస్తే మేలైన పాలన ఈ రకంగా అందిస్తాను అని తన అజెండా చెప్పి జనాలకు చేరువ అయితే కచ్చితంగా జనసేన బొమ్మ సూపర్ హిట్ అవుతుంది. కానీ ఘడియకో రకంగా ఉంటూ ఒకసారి వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ టీడీపీ దారిలోకి వెళ్ళినట్లుగా భ్రాంతిని కలిగిస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు.
అలాగే మరో వైపు కేంద్ర పెద్దల్తో బీజేపీ నేతలతో సమావేశాలు జరుపుతూ ఇక రూట్ అటే అన్న సంకేతాలు ఇస్తున్నారు. ఈ మధ్యలో చేసిన పోరాటాలు కూడా ఆగుతునాయి. కంటిన్యూస్ గా చేసిన పోరాటాలు అయితే లేవు. ఇంకో వైపు పార్టీ పటిష్టత కూడా ఆలోచన లేదు. ఈ విధంగా అయోమయ రాజకీయాలు చేసుకుంటూ వస్తున్న పవన్ మీద జనసైనికులే కాస్తా అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది.
బస్సు యాత్ర అన్నారు, అది ఆపేశారు, జనంలోకి మరోలా వస్తామని అన్నారు దాన్ని పక్కన పెట్టారు. ఇంకో వైపు చూస్తే సినిమాలు అంటారు, మధ్యలో వీకెండ్ పాలిటిక్స్ అంటారు. వీరావేశం ప్రదర్శిస్తారు, అంతలో మళ్లీ విమానంలో వచ్చిన ఫ్లైట్ లోనే వెళ్ళిపోతారు. మరీ ఇలా ఉంటే ఎలా పవన్ సార్ అని సైనికులే అంటున్నారుట.
కచ్చితంగా ఒక మాట మీద ఉందాం, వారూ వద్దు వీరూ వద్దు సోలోగానే సింగిల్ గానే తేల్చేసుకుందాం, మీ వెనక మేమున్నాం. మీ నుంచి కచ్చితమైన ప్రకటన రానీయండి కదం తొక్కుతాం, 2024లో అమీ తుమీ తేల్చుకుందామని సైనికులు గంభీరంగానే చెబుతున్నారుట. మరి పవన్ సార్ అయోయమం వీడి కనుక సింగిల్ గా బరిలో దిగితే ఏపీ రాజకీయమే షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.