రోజా అంటే ఫైర్ బ్రాండ్. ఆమె విపక్షంలో ఉన్నపుడు చాలా ఎక్కువగానే మాట్లాడారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంత అలిగి తగ్గిపోయారు. సెకండ్ టెర్మ్ లో ఆమెకు చాన్స్ వచ్చింది. అంతే మినిస్టర్ అయిపోయారు. ఇపుడు రోజా మళ్లీ మీడియా ముందు హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అతి ఉత్సాహంలో రోజా చేస్తున్న కొన్ని కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక దశలో వివాదం కూడా అవుతున్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా విశాఖ వచ్చిన రోజా ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె పాల్గొన్నారు. అవన్నీ అలా ఉంటే మీడియా ముందు రోజా అల్లూరి గురించి చెబుతూ టంగ్ స్లిప్ అయి అల్లూరి వర్ధంతికి బదులుగా జయంతి అని మాట్లాడేశారు.
ఆ టైమ్ లో ఆమె పక్కన కేంద్ర టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక వైసీపీ బీజేపీ నేతలు, అల్లూరి అభిమానులు ఉన్నారు. రోజా ఉత్సాహంగా మాట్లాడుతూ అల్లూరి జయంతి అనేయడంతో అక్కడ అంతా షాక్ అయినా సర్దుకున్నారు తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది కాస్తా ఒక్కసారిగా మీడియాలో ప్రసారం కావడంతో తెగ వైరల్ అవుతోంది.
జయంతికి వర్ధంతికి తేడా తెలియని మంత్రి మన రోజమ్మ అంటూ నెటిజన్లు ఒక్కటే ఆడుకుంటున్నారు. దీని వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ కధ ఉంది. రోజా అప్పట్లో లోకేష్ మీద ఏకంగా అసెంబ్లీలోనే ఈ తరహా కామెంట్స్ చేశారు. లోకేష్ కూడా ఒక సందర్భంలో ఒక మహా నేత కార్యక్రమానికి హాజరై జయంతికి బదులు వర్ధంతి అని పొరపాటున అనేశారు.
సరే అదేదో పొరపాటున జరిగింది అని నాడు వైసీపీ ఊరుకోలేదు. రోజా అయితే దాన్ని అసెంబ్లీలో ఒక ఇష్యూని చేస్తూ చినబాబుకు అసలు ఏమీ తెలియదు అంటూ గాలి తీసేశారు. ఇపుడు అదే రోజా తాను కూడా ఏమీ తెలియని మంత్రిని అనిపించేసుకున్నారు.
ఇక దీని మీద టీడీపీ సోషల్ మీడియా యాక్టివిట్స్ అయితే రోజమ్మ అంటే అంతేగా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయినా ఒక కార్యక్రమానికి వస్తున్నపుడు అది జయంతో వర్ధంతో మన నేతాశ్రీలు తెలుసుకోకుండా మీడియా ముందు మాట్లాడం వల్లనే ఇలాంటివి వస్తున్నాయని అంటున్నారు.