బాబు నో చెప్పేశారు...వీరి సంగతేంటి...?

Update: 2022-09-17 01:30 GMT
మొత్తానికి చంద్రబాబు తాను మెత్తగా ఉండనని చెప్పేశారు. తనతో ఎవరు ఉంటే పార్టీ కోసం ఎవరు పోరాడితే వారికే టికెట్లు అని తేచేశారు. పదహారు మంది ఎమ్మెల్యేలే నికరంగా టీడీపీ తరఫున అసెంబ్లీ లోపలా బయటా కనిపిస్తున్నారు. వారే యాక్టివ్ కాబట్టి టికెట్లు ఇచ్చేస్తున్నా అని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నిజంగా ఇది బాబు తీరుకు భిన్నం.  ఇలా బాబు యమ స్పీడ్ గా  నిర్ణయం తీసుకోవడం వల్ల సిట్టింగులు అంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

అదే టైం లో పార్టీని వీడి వైసీపీకి జై కొట్టిన నలుగురి పరిస్థితి మీదనే చర్చ సాగుతోంది. ఆ నలుగురూ ఎవరంటే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, గుంటూర్ వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల‌ గిరి, క్రిష్ణా జిల్లా గన్నవ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. వీరంతా ఫ్యాన్ నీడన సేదతీరుతున్నారు.

అయితే మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు ఉన్నాయి. మరి వీరికి టికెట్లు వచ్చే ఎన్నికల్లో తాము జై కొట్టిన వైసీపీ ఇస్తుందా అంటే అది మాత్రం అడగకూడదనే అంటున్నారు. ఎందుకంటే సర్వేలనే వైసీపీ అధినాయకత్వం నమ్ముతోంది. గ్రాఫ్ ఎవరిది బాగుంటే వారికే టికెట్ అంటోంది. అలా చూస్తే మద్దాల గిరికి గుంటూరు వెస్ట్ లో అంతగా సీన్ లేదని ఒక అంచనా అయితే పార్టీలో ఉందిట. దాంతో ఆయనకు టికెట్ కష్టమని అంటున్నారు

అలాగే వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే ఆ ప్రభావమే  ఉమ్మడి క్రిష్ణా జిల్లా మొత్తం వేరేగా ఉంటూ వైసీపీకి ఇబ్బందులో నెడుతుంది అని అంటున్నారు. ఆయన చంద్రబాబు ఫ్యామిలీ మీద అప్పట్లో చేసిన ఘాటు కామెంట్స్ రచ్చ రేపాయి. దాంతో ఆయనకే టికెట్ అంటే మహిళల సెంటిమెంట్ ఎలా టర్న్ అవుతుందో అన్న కంగారు అధినాయకత్వానికి ఉంది. దాంతో పాటు వైసీపీకి అక్కడ బలమైన నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా వంశీకి సహకరించకపోగా దెబ్బ కొడతారు అన్న రిపోర్టులు ఉన్నాయి. దాంతో ఇక్కడ కూడా వైసీపీ టికెట్ విషయం తేల్చలేదనే అంటున్నారు.

అలాగే  చీరాలలో కరణం బలరాం సీటు విషయంలో కూడా ఆలోచించల్సినదే అంటున్నారు. ఆయన వయసు దృష్ట్యా సీటు నిరాకరిస్తారని అంటున్నరు. మరి ఆయన తనయుడు రాజకీయ వారసుడు కరణం వెంకటేష్ కి టికెట్ ఇస్తారా ఇస్తే ఎక్కడ అన్నది కూడా ఇప్పటికైతే సస్పెన్స్ లో ఉంది. ఇక్కడ వైసీపీకి  ఆమంచి కృష్ణమోహన్ గట్టి క్యాండిడేట్ గా ఉన్నారు. ఇక కరణం వెంకటేష్ ని పర్చూరు  పంపుతారు అని అంటున్నరు. కానీ ఏదీ ఇప్పటికైతే తెమలని విషయంగానే ఉంది.

విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ కన్ ఫర్మ్ చేశారా అంటే ఇప్పటికి ఓకే అనుకున్నా అక్కడ కూడా ఆయన గ్రాఫ్ మీద వైసీపీకి డౌట్లు ఉన్నాయట. దాంతో ఎన్నికల వేళకు ఏమైనా మార్పులు ఉంటాయా అన్నది చెప్పలేమనే అంటున్నారు. టోటల్ గా చూస్తే ఈ నలుగురికి టికెట్ గ్యారంటీ అయితే ఈ రోజుకీ వైసీపీ అధినాయకత్వం ఇవ్వలేదు, అదే వీరు టీడీపీలో ఉండి సర్కార్ మీద  పోరాడితే చంద్రబాబు కచ్చితంగా 2024 ఎన్నికలకు టికెట్ ఇచ్చేవారు అని తాజాగా ఆయన ప్రకటించిన దాన్ని బట్టి అర్ధమవుతంది. మరి ఈ నలుగురి విషయం జగన్ తేల్చకపోతే మాత్రం వారు రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News