అవును ఇదే భావనలో ఆ పెద్దాయన ఉన్నారు. వయసు ఏడున్నర పదులు. కాంగ్రెస్ లో ఢక్కామెక్కీలు తిన్న నేత. పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. దాంతో రాజస్థాన్ లాంటి చక్కని రాష్ట్రానికి సీఎం అయ్యారు. కడుపులో చల్ల కదలకుండా హాయిగా అయిదేళ్ళూ లాగించవచ్చు అనుకున్న వేళ పిలిచి మరీ కాంగ్రెస్ పార్టీ పెద్దగా కిరీటం పెట్టడానికి గాంధీలు రెడీ అయ్యారు.
తమ మాట వింటారని నమ్మిన బంటు అని వారు భావించారు. అందులో పొరపాటు చేమీ లేదు యువ నాయకుడు సచిన్ పైలెట్ ని కాకుండా అశోక్ గెహ్లాట్ కే రాజస్థాన్ పదవిని ఇచ్చి ఆయన పెద్దరికాన్ని నాడు గౌరవించారు. ఇపుడు ఎటూ ఎన్నికల వేళ అయింది. పైగా యువకుడి చేతిలో పగ్గాలు ఇస్తే రాష్ట్రాన్ని గెలుచుకోవచ్చు. ఇటు అశోక్ గెహ్లాట్ ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి తెర వెనక తమ ఆధిపత్యం చూపించుకోవచ్చు అని గాంధీలు స్కెచ్ గీశారు.
అయితే అయిష్టంగానే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఒప్పుకున్న గెహ్లాట్ మొదటి నుంచి ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు మాత్రం అసలు ఇష్టపడడంలేదు. దాంతో ఆయన పాదయాత్రలో ఉన్న రాహుల్ వద్దకు వెళ్ళి చెవిలో చెప్పాల్సింది చెప్పి వచ్చారు ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ రెండు పదవులూ చేయవచ్చు చేస్తానంటూ తన మనోభీష్టాన్ని చాటుకున్నారు.
కానీ గాంధీలు మాత్రం ససేమిరా అనేశారు. పైగా సీఎం సీట్లో కూర్చున గెహ్లాట్ కి చెవిలో జోరిగ మాదిరిగా కొన్నేళ్ళుగా నానా ఇబ్బందులు పెట్టిన సొంత పార్టీ ప్రత్యర్ధి సచిన్ కి పదవి ఇవ్వడం తో తీవ్ర అసంతృప్తికి గురి అయ్యారు. దాంతో తాను కాకున్నా తన వారికైనా సీఎం కుర్చీ ఇవ్వమనంటూ మరో రాయబేరం పెట్టారు. అదీ కుదరకపోవడంతో ఆయన తన వర్గం బలాన్ని చూపించారు. ఏకంగా 90 మంది దాకా ఎమ్మెల్యేలు గెహ్లాట్ వైపు ఉన్నట్లుగా చాటుకున్నారు.
ఈ పరిణామంతో బిత్తరపోయిన హై కమాండ్ గెహ్లాట్ అసలు రాజకీయం తెలిసి మండిపడుతోంది. పెద్దాయన అనుకుంటే ఇలాగనా అంటూ ఏకంగా గెహ్లాట్ కే జరిగిన పరిణామాలు అన్నింటి మీద లిఖిత పూర్వకమైన నివేదిక ఇమ్మని సోనియమ్మ హుటాహుటిన కోరారు. ఇంకో వైపు ఆయన ఇక తమ పార్టీకి ప్రెసిడెంట్ కూడా కాదు, అక్కరలేదు అని గాంధీలు గట్టిగానే
తీర్మానించుకున్నారుట.
ఈ నేపధ్యంలో పెద్దాయన ఏం చేస్తారు అన్నదే ఇపుడు చర్చ. ఆయన తీరు చూస్తే కాంగ్రెస్ స్కూల్ లోనే పెరిగారు. వయసు మళ్ళింది కాబట్టి తిరుగుబాటు చేస్తారా అన్న ప్రశ్న ఉన్నా కాదు లేదు అనే జవాబు వస్తోంది. కానీ ఎనభయ్యేళ్ల పంజాబ్ పెద్దాయన కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంటి వారే పార్టీని వదిలేసి బయటకు పోయి ఆనక ఇపుడు బీజేపీ గూడు చేరాక గెహ్లాట్ కి కూడా అదే తోవా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. మరి గెహ్లాట్ ఏం చేస్తారు.
సచిన్ సీఎం గా ఉంటే ఆయన బలం అంతా పోయినట్లే. పైగా అధ్యక్ష పదవి ఎందుకు ముఖ్యమంత్రి పదవే గొప్ప అని ఆయనకూ తెలుసు. సన్నిహితులూ చెబుతున్నారు. దాంతో నిన్న సచిన్ కి కన్ను గీటిన కమలం నేడు గెహ్లాట్ కి వల విసురుతోందిట. మరి ఈ పెద్దాయన పడతారా. ఏమో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ ని వీడిపోతారు అని ఎవరైనా అనుకున్నారా. అశోక్ రూట్ కూడా బీజేపీ వైపు అయితే రాజస్థాన్ రాజ్యంలో కాంగ్రెస్ ఇక లేనట్లే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.