తేడా కలిగిన పార్టీ అని బీజేపీ ఎపుడూ చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఈ ముచ్చట అంతా వాజ్ పేయ్ అద్వానీ ద్వయం ఏలిన శకం నాటిది. ఇపుడు అంతా మారింది. బీజేపీ తాను కూడా ఆ తానులో ముక్కనే అంటోంది. పైగా కాంగ్రెస్ ని ఏ విషయం మీద దశాబ్దాల తరబడి బీజేపీ విమర్శిస్తూ వచ్చేదో ఇపుడు అవే అవలక్షణాలను పుష్కలంగా తాను పుచ్చుకుని ఆఖరుకు తానే మారిపోయింది అన్న విమర్శలు ఉన్నాయి.
అధికార కోసం కాంగ్రెస్ నాడు చేసిన దాని కంటే బీజేపీ ఎక్కువే చేస్తోంది అన్నది నిఖార్సైన రాజకీయ విశ్లేషకుల మాట. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ దేశంలోని మిగిలిన పార్టీల కంటే కూడా అత్యధికంగా ఖర్చు చేసి టాప్ ర్యాంక్ ని కొట్టేసింది. ఈ వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ద్వారా వెల్లడయ్యాయి.
ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, పంజాబ్ లలో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రాలు అన్నీ కలిపి బీజేపీ 340 కోట్ల రూపాయలను వెచ్చించినట్లుగా ఈసీ వివరాలు తెలిపాయి. ఇందులో ఎక్కువగా యూపీ ఎన్నికల కోసం బీజేపీ 221 కోట్లు ఖర్చు చేసింది. అలాగే ఉత్తరాఖండ్ లో 43.67 కోట్లు, మణిపూర్ లో 23 కోట్లు, పంజాబ్ లో ముప్పయి ఆరు కోట్లు, గోవాలో 19 కోట్లు వెచ్చించినట్లుగా ఈసీకి బీజేపీ సమర్పించిన నివేదికలు తెలియచేస్తున్నాయి.
ఇక బీజేపీ తరువాత స్థానం కాంగ్రెస్ దే. ఆ పార్టీ 184 కోట్ల మేర ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ 47.54 కోట్లు ఖర్చు చేసింది. ఆప్ 11.32 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఈసీ నివేదిక వెల్లడించింది. ఇలా అన్ని పార్టీలు తమ శక్తిమేరకు ఖర్చు చేశాయన్న మాట. అయితే ఇందులో భారీ వాటా బీజేపీదే. ఒక విధంగా కమలం పార్టీ ఖర్చుకు వెనకాడలేదు అని తెలుస్తోంది.
రాష్ట్రాలలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే ఆ ఖర్చుని ఆయా పార్తీలు తప్పనిసరిగా ఈసీకి ఇవ్వాలి. అలా ఇచ్చిన అఫీషియల్ లెక్కలు ఇవ్వన్న మాట. అంటే నిబంధలన మేరకు చేసిన ఖర్చుగా ఇది ఉంది. ఇది కాకుండా అనధికారికంగా అంటే లెక్కకు చిక్కని ఖర్చు ఎంత అన్నది ఊహించుకుంటేనే కళ్ళు జిగేల్మంటాయి. ఏది ఏమైనా బీజేపీ మాత్రం తన రూటే సెపరేట్ అంటోంది అనుకోవాలి.
ఇంత ఖర్చు చేసిన బీజేపీ అయిదింట నాలుగు రాష్ట్రాలలో గెలిచి సత్తా చాటింది. బీజేపీ ఖర్చులో సగం పెట్టిన కాంగ్రెస్ మాత్రం అన్నింటా ఓడి వాడింది. ఇక ఆప్ అయితే పంజాబ్ లో గెలిచి నిలిచింది. సో నిధులు ఖర్చు ఎంత అని కాదు పొలిటికల్ టాలెంట్ లోనూ బీజేపీదే టాప్ ప్లేస్ అని అర్ధం చేసుకోవాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.