డ్రాగన్ ప్రభుత్వం మరీ ఇంత అన్యాయమా ?

Update: 2022-05-03 06:30 GMT
కరోనా వైరస్ బాధితుల విషయంలో డ్రాగన్ ప్రభుత్వం మరీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ కరోనా వైరస్ బాధితులంటే పాజిటివ్ వస్తే ఒక రకమైన సమస్య నెగిటివ్ వచ్చినా మరో రకమైన సమస్యగా ఉంది. పాజిటివ్ వస్తే ప్రభుత్వం వెంటనే ఆసుపత్రిలో చేర్చేస్తోంది. అలాగే నెగిటివ్ వస్తే కూడా జనాలు నగరంలో నుండి బయటకు ఎక్కడికో పంపేస్తోంది.

కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళను వెంటనే ప్రభుత్వం ఆసుపత్రుల్లోని ఐసొలేషన్ కేంద్రాల్లో చేర్చేస్తోంది. అలాగే నెగిటివ్ వచ్చిన వాళ్ళని తాము ఉంటున్న లొకాలిటీల నుండి నగరానికి 400 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి ఎక్కడో ఉంచుతోంది. ఇలా ఎందుకు చేస్తున్నారంటే పాజిటివ్ రోగుల మధ్య ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా కరోనా వైరస్ వస్తుందని అధికారులు సమాధానం చెబుతున్నారట.

ఇదే విషయమై లూసీ అనే మహిళ మాట్లాడుతూ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తనలాంటి కొన్ని వందల మందిని ప్రభుత్వం షాంఘై నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేసులో ఉంచినట్లు చెప్పారు.

చిన్న క్యాబిన్లలో తమందరినీ కుక్కేసినట్లు లూసీ భోరుమంటున్నారు. తాము ఇక్కడ ఎన్నిరోజులు ఉంచుతారు ? ఎప్పుడు తిరిగి తమ ఇళ్ళకు పంపుతారో కూడా ఎవరు చెప్పటం లేదన్నారు. తమను ఉంచిన కొత్త ప్రాంతంపై తమకు చాలా భయంగా ఉందన్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే సుమారు నెలరోజులుగా షాంఘై నగరంలోని సుమారు 1.5 కోట్ల మంది జనాలను ప్రభుత్వం లాక్  డౌన్లో ఉంచేసింది. జనాలు బయటకు రాకుండా ప్రభుత్వం తలుపులను బయటనుండి సీల్ చేసేసింది. దాంతో జనాల్లో అత్యధికులు నెలరోజుల నుండి ఇళ్ళల్లోనే మగ్గుతున్నారు.

లాక్ డౌన్ కు వ్యతిరేకంగా జనాలు ఎంతగా గోల చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే బయట తిరుగుతుంటే కరోనా వైరస్ వచ్చే అవకాశముంది కాబట్టి తిరగద్దంటారు. కానీ డ్రాగన్ ప్రభుత్వం మాత్రం నెగిటివ్ వచ్చిన వాళ్ళని నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉంచటం ఏమిటో అర్ధం కావడం లేదు.
Tags:    

Similar News